Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

బీజేపీ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలేనా? అమిత్ షా వ్యాఖ్యల వెనుక ఉద్దేశం అదేనా?

Bjp Next target, బీజేపీ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలేనా?  అమిత్ షా వ్యాఖ్యల వెనుక ఉద్దేశం అదేనా?

దేశంలో 17రాష్ట్రాల్లో బలమైన పార్టీగా అవతరించిన బీజేపీ. తెలంగాణలో ఇప్పటికే నాలుగు స్ధానాల్లో సత్తా చాటింది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా విజృంభించి అధికారాన్నిచేపట్టడమే లక్ష్యంగా సాగుతోంది. మరోవైపు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ అధికారాన్ని పోగొట్టుకున్న టీడీపీ నేతలకు, రాజ్యసభ సభ్యులకు గాలం వేసింది. ఇప్పటికే ఆపార్టీకి వలసలు జోరందుకున్నాయి. ఒక్కసీటు సొంతంగా గెలవలేని బీజేపీ ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తుండటం అధికార పార్టీకి చెమటలు పట్టిస్తోంది. దీన్ని బట్టి బీజేపీ లక్ష్యం దక్షిణాది రాష్ట్రాల్లేనని అర్ధమవుతోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బావిస్తోంది బీజేపీ. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజా వ్యాఖ్యాలు ఇదే విషయాన్ని వెల్లడిచేస్తున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ శనివారం హైదరాబాద్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారాన్ని చేపట్టేది బీజేపీనే అంటూ ఆయన ధీమా వ్యక్త చేశారు. ఆయన తాజా వ్యాఖ్యలు టార్గెట్ సౌత్ స్టేట్స్ అనే నినాదాన్ని బలపరిచేవిగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అధికార పార్టీని మొహమాటం లేకుండా విమర్శించాలని, తమకు టీఆర్ఎస్‌తో ఎలాంటి సత్సంబంధాలు, లాలూచీలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రభుత్వం అవినీతికి, పాల్పడుతుందని విమర్శించిన అమిత్ షా.. దాన్ని బట్టబయలు చేయడానికి రాష్ట్రం నుంచి మీరు, కేంద్రం నుంచి మేమ పోరాటం చేస్తామన్నారు. అమిత్ షా ఇచ్చిన ధైర్యం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో హుషారు కలిగించింది.

ఇప్పటికే కర్ణాటక పరిస్థితి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమితో గత ఏడాది ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే దశలో ఉంది. ఈ పరిస్థితిలో అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ.. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీగా ఉంది. అయితే కర్ణాటక తర్వాత నెక్ట్స్ టార్గెట్ తెలంగాణనే అనేలా బీజేపీ వ్యవహరిస్తోంది.

అదే సమయంలో ఏపీలో కూడా అధికారం చేపడతామని అమిత్ షా చేసిన ప్రకటన అటు ఏపీలో కూడా రాజకీయ వర్గాలను కలవరపెడుతోంది. ఒక్కసీటు కూడా గెలవలేని బీజేపీ అధికారాన్ని ఎలా చేపట్టగలదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో కూడా బీజేపీ చురుగ్గా పావులు కదుపుతూ పార్టీలో చేరికలకు తలుపులు తెరిచింది. ఈసారి బడ్జెట్‌పై అధికార వైసీపీ పెదవి విరిచింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ నిధుల కేటాయిపులో న్యాయం జరగలేదని బీజేపీపై నేరుగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీపై గురిపెట్టిన బీజేపీ సీఎం జగన్‌కు సహకరించకుండా పోలవరం సహా చాలా అంశాల్లో నిధులు ఇవ్వకుండా అడ్డుకునే ఛాన్స్ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.