కమల్‌నాథ్, దిగ్విజయ్ మహా మోసగాళ్లుః జ్యోతిరాదిత్య

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులపై బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కమల్‌నాథ్, దిగ్విజయ్ మహా మోసగాళ్లుః జ్యోతిరాదిత్య
Follow us

|

Updated on: Oct 26, 2020 | 8:41 PM

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులపై బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీకి చెందిన మాజీ సీఎం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌లు మహా మోసగాళ్లు అనీ… అవినీతి ప్రభుత్వాన్ని నడిపి ఓట్లు వేసిన ప్రజలను నిలువునా మోసగించారంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అడుగడుగునా నిర్లక్ష్యం వహించడం వల్లే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని సింధియా గుర్తు చేశారు. వచ్చే నెల 3న జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 28 స్థానాల్లో 27 కాంగ్రెస్ పార్టీ స్థానాలే అయినందున… బీజేపీ నష్టపోయేదీ ఏమీ లేదన్నారు. నష్టమంతా కాంగ్రెస్‌కేనని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుంటే, జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. మధ్య ప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోవడంతో పాటు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అనంతరం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇంకో మూడు స్థానాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అకాల మరణంతో ఖాళీ అయ్యాయి. దీంతో వచ్చే నెల 3న ఉప్ప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది.

మధ్య ప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జ్యోతిరాధిత్య సింధియా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మద్దతు లేదని స్పష్టమవుతోంది. క్షేత్ర స్థాయిలోనే కాదు.. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ పట్ల కనీసం విశ్వాసం లేదని సింధియా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు