ఇదో విచిత్రం.. ఆ సంతలో బైకులు కూడా దొరుకుతాయి!

బట్టలైనా, వస్తువులైనా, లేదా నిత్యావసర వస్తువులు ఏది కావాలన్న ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్‌లో కొంటున్నారు. అయితే గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ సంతలకు ప్రాముఖ్యత ఎక్కువే. నిత్యావసర పనిముట్ల దగ్గర నుంచి కొత్త బట్టలు వరకు అన్ని కూడా సంతలో విక్రయిస్తారు. ఇది ఇలా ఉంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సంతకు ఓ ప్రత్యేకత ఉంది.. ఇక్కడ డైలీ రొటీన్‌లో వాడే వస్తువులతో పాటు వాహనాల క్రయ విక్రయాలు జరుపుతుండటం విశేషం. మున్సిపాలిటీ దీని కోసం ప్రత్యేకంగా […]

ఇదో విచిత్రం.. ఆ సంతలో బైకులు కూడా దొరుకుతాయి!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 28, 2019 | 1:53 PM

బట్టలైనా, వస్తువులైనా, లేదా నిత్యావసర వస్తువులు ఏది కావాలన్న ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్‌లో కొంటున్నారు. అయితే గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ సంతలకు ప్రాముఖ్యత ఎక్కువే. నిత్యావసర పనిముట్ల దగ్గర నుంచి కొత్త బట్టలు వరకు అన్ని కూడా సంతలో విక్రయిస్తారు. ఇది ఇలా ఉంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సంతకు ఓ ప్రత్యేకత ఉంది.. ఇక్కడ డైలీ రొటీన్‌లో వాడే వస్తువులతో పాటు వాహనాల క్రయ విక్రయాలు జరుపుతుండటం విశేషం. మున్సిపాలిటీ దీని కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కూడా కేటాయించింది. అయితే అక్కడ స్థలం సరిపోకపోవడంతో సిఎస్ఐ మైదానంలో సంత నిర్వహిస్తారు. ఇందులో టూవీలర్స్, ఫోర్ వీలర్స్ విక్రయాలు నిర్వహిస్తున్నారు. సుమారు ఇరవై మంది వ్యాపారులు ఈ సంతపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్నారు. అంతేకాక ఎవరైనా తమ పాత వాహనాన్ని అమ్ముకోవాలని చూస్తున్నా.. ఇక్కడ వ్యాపారాలు వారికి సౌకర్యం కల్పిస్తారు.

ఇంకో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ సంతలో ప్రతివారం లక్షల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. కామారెడ్డి చుట్టుపక్కల ఈ సంత ప్రాచుర్యం పొందింది. దూరప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే వినియోగదారులకు సంబంధించిన గుర్తింపు కార్డులు, పూర్తి డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. చోరీ వాహనాలకు ఆవ‌కాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియను చేపడుతున్నారు. సుమారు వంద మంది ఈ వాహనాల సంతపై ఆధారపడి జీవిస్తున్నారు. మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తూ కమిషన్ పద్ధతిలో క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. వాహనాలను సంతలో విక్రయించడం ఇక్కడే చూస్తున్నామని అక్కడ స్థానికులు చెబుతున్నారు. కమీషన్ దోపిడీ లేకుండా ఈ విధమైన వ్యాపారం చాలా బాగుందని వారు అంటున్నారు. ఇలాంటి సంతలు అన్ని చోట్లా ఉండాలని కోరుకుందాం.

Latest Articles