Bigg Boss Telugu 4: ఒంటరోడే ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు

యస్..బిగ్ బాస్ గురించి మేము ఇంతకుముందు రాసిందే జరిగింది. ఏ మాత్రం అంచనా వెయ్యని కుమార్ సాయి హౌస్ నూతన కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు.

Bigg Boss Telugu 4: ఒంటరోడే ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు
Follow us

|

Updated on: Oct 02, 2020 | 1:13 PM

యస్..బిగ్ బాస్ గురించి మేము ఇంతకుముందు రాసిందే జరిగింది. ఏ మాత్రం అంచనా వెయ్యని కుమార్ సాయి హౌస్ నూతన కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఒంటిరిగా, నిజాయితీగా పోరాటం చేసే వారికి ప్రకృతి సహరిస్తుందేమో అనిపిస్తుంది తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన పరిణామాలు చూస్తుంటే. అవును అచ్చం అలాంటి పరిణామాలే జరిగాయి తాజా ఎఫిసోడ్ లో.  కాయిన్స్ టాస్క్ లో అందరూ పోటీ పడి ఆడారు. కొందరు కేవలం తమకు దొరికిన కాయిన్స్ దాచుకోగా, మరికొందరు చోర కళతో వాటిని హస్తగతం చేసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది నూతన కెప్టెన్ కుమార్ సాయి గురించి. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అతడ్ని ఇప్పటికే ఎన్నో సార్లు నామినేట్ చేశారు. అతడు తమతో సరిగ్గా కలవడం లేదని, టాస్కులలో భాగస్వామి అవ్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు. కానీ ప్రతిసారి జనాలు ఓట్ల ద్వారా అతడ్ని గెలిపిస్తూ వస్తున్నారు.

తాజా కాయిన్ టాస్క్ లో కుమార్ సాయి వేరే వాళ్ల కాయిన్స్ కోసం ప్రాకులాడలేదు. తనవి జాగ్రత్తగా కాపాడుకున్నాడు అంతే. చివర్లో సామ, దాన, బేధ దండోపాయాలు ఉపయోగించుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్పినప్పటికీ అతడు తన వద్ద కాయిన్స్ అలాగే ఉంచుకున్నాడు. మిగతా వారందరూ మరొకరికి మద్దతు తెలుపుతూ వారికి కాయిన్స్ ఇచ్చేశారు. కాయిన్స్ విలువ లెక్కగట్టినప్పుడు కుమార్ సాయి టాప్ 4 లో నిలిచాడు. బిగ్ బాస్ టాప్ 4 మెంబర్స్ కి మాత్రమే కెప్టెన్సీ టాస్క్ ఆడే అవకాశం ఇచ్చాడు. అ టాస్క్ లో ఎక్కువ కాయిన్స్ పోగు చేసి కుమార్ సాయి నూతన కెప్టెన్ గా అవతరించాడు. అతడు కెప్టెన్సీ ట్యాగ్ ధరించిన కారణంగా ఈ వారం అతడ్ని నామినేట్ చేయడానికి వీలుండదు. ఇది ఎవరూ ఊహించని విషయమనే చెప్పాలి. నీతి ఏంటంటే…వాళ్లు, వీళ్లని కాదు..ముందు మనల్ని మనం నమ్ముకోవాలి. అప్పుడు విజయం సాధిస్తే ఆనందం వస్తుంది. పరాజయం పాలైతే పోరాడి ఓడామన్న సంతృప్తి మిగులుతుంది.

Also Read :

“ఏ, ఎస్, ఆర్” : దీపికా చెప్పిన ఆ ముగ్గురు హీరోలు ఎవరు, ఇవిగో హింట్స్ !

Latest Articles
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం