బిగ్‌బాస్: మహేష్ ఔట్..? తప్పంతా తనదే..!

bigg boss 3: Mahesh vitta might get eliminated from house, బిగ్‌బాస్: మహేష్ ఔట్..? తప్పంతా తనదే..!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3.. హాట్ హట్‌గా జరుగుతోంది. నువ్వెంతంటే.. నువ్వని ఇంట్లో.. రచ్చ చేస్తున్నారు ఇంటి సభ్యులు. ఇంతకూ బిగ్‌బాస్ హౌజ్‌లో ఏం జరుగుతోంది.. ఎప్పుడూ గొడవలు.. కొట్లాటలేనా.. గేమ్‌ ఆడేదైనా ఏమైనా ఉందా..? లేక ఆల్రెడీ ఎవరి గేమ్‌ ప్లాన్‌ను వాళ్లు అమలు చేస్తున్నారా..? లేక తోచింది చేసుకుపోతున్నారా..? ఇంతకూ ఆడుతున్నదెవరు..? ఆడిస్తున్నదెవరు..?

ఆ ఇంట్లో.. ఆ పిల్లగాడు చాలా అమాయకుడట.. పుల్లలు పెట్టడమేంటో తెలియని చంటోడట. అసలు పుల్లలకు తోటకూరకట్టలకు తేడా తెలియదట. ఇంతకూ అతను చెప్పేది నిజమేనా..? మరోవైపు అలీ రెజా ఆగ్రహం. కెప్టెన్ శివజ్యోతి శాంతిమంత్రం. ఇలా 32వరోజు ఇల్లు గుల్లయ్యేలా అరుచుకున్నారు. ఒకరిపై ఒకరు తిట్టిపోసుకుంటూ నానా రచ్చ చేశారు.. చివరకు ఇష్యూ చినిగి చాటంతైంది.

డజన్‌ మంది ఇంటిసభ్యుల్లో కొందరిపై డబుల్‌ స్టాండర్డ్‌ ఆరోపణలున్నాయ్‌.. ఫిటింగ్ మాస్టర్‌ అన్న నిందలూ ఉన్నాయ్‌.. మరి ఇలాంటి ఇష్యూస్‌కు చెక్‌ పెట్టేందుకు బిగ్‌బాస్ పోస్ట్‌బాక్స్‌ ఎపిసోడ్‌ను కండక్ట్ చేస్తాడు. ఎవరిపైనైనా కంప్లైంట్స్ ఉంటే.. పోస్ట్‌ కవర్‌లో రాసి బాక్స్‌లో వేయాలని ఆదేశిస్తాడు. ఇక్కడే పాత గొడవ మళ్లీ పురుడుపోసుకుంది. మాటంటే పడను అన్న రేంజ్‌లో మహేష్‌ రెచ్చిపోతే.. నువ్వెంత అనే స్థాయిలో అలీ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వీరిద్దరి మాటల యుద్ధాన్ని ఆపేందుకు శివజ్యోతి ఎంత ప్రయత్నించినా.. వారిద్దరూ ఏమాత్రం తగ్గలేదు.

అలీ-మహేష్‌ ఇష్యూతో ఇల్లు మరింత వేడిక్కింది. మధ్యలో రాహుల్‌-శ్రీముఖిల టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్‌కు ఇక్కడైనా ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించారంతా.. కానీ రాహుల్ ఎక్సప్లనేషన్‌తో శ్రీముఖి మరింత రెచ్చిపోయింది. మరి టోటల్ ఎపిసోడ్‌లో ఎవరిపై ఎక్కువ ఫిర్యాదులొచ్చాయి..? వారికి బిగ్‌బాస్ ఇచ్చిన ఫనిష్‌మెంట్ ఏంటి..? అని తెలసుకోవాలంటే.. ఈరోజు ఎపిసోడ్‌ వరకు ఎదురు చూడాల్సిందే.

కాగా.. ఓవరాల్‌గా మహేష్‌పైనే హౌస్‌‌మెంట్స్ అందరూ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. తను కూడా.. ఏదీ సరిగా ఇంటి సభ్యులకు కన్వే చేయకపోవడం కూడా మొదటి నుంచీ ప్రాబ్లమ్‌ అవుతోంది. అయితే.. ఈ వీక్ నామినేషన్స్‌లో శివజ్యోతి, మహేష్, పునర్నవి, రాహుల్, హిమజ, అషురెడ్డిలు ఉన్నారు. వీరందరిలో.. నెగిటీవ్‌గా మహేస్ ఉన్నట్టు కనపిస్తోంది. చూడాలి మరి.. తనే బయటకు వెళ్లిపోతాడే.. లేక ఇంకెవరో..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *