బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ఎలా ఉందంటే?

శంషాబాద్‌లో నలుగురు కిరాతకుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన దిశకి జరిగిన అన్యాయంపై యావత్‌ సమాజం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దిశకు న్యాయం చేయాలంటే సత్వర న్యాయం కావాలని సభ్యసమాజం పట్టుబట్టింది.  పార్లమెంటు ఉభయసభల్లోనూ ఇదే డిమాండ్‌ ప్రతిధ్వనించింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపైనా తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. తమ పరిధిలోకి ఈ కేసు రాదని తొలుత ఒక పోలీస్‌ స్టేషన్‌లోని పోలీసులు చెప్పారు. బాధితురాలు తనకుతానుగా వెళ్లిపోయిందని పోలీస్‌ అధికారులు దిశ కుటుంబ సభ్యులను అవమానించారు. వారు […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ఎలా ఉందంటే?
Follow us

| Edited By:

Updated on: Dec 02, 2019 | 10:51 PM

శంషాబాద్‌లో నలుగురు కిరాతకుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన దిశకి జరిగిన అన్యాయంపై యావత్‌ సమాజం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దిశకు న్యాయం చేయాలంటే సత్వర న్యాయం కావాలని సభ్యసమాజం పట్టుబట్టింది.  పార్లమెంటు ఉభయసభల్లోనూ ఇదే డిమాండ్‌ ప్రతిధ్వనించింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపైనా తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. తమ పరిధిలోకి ఈ కేసు రాదని తొలుత ఒక పోలీస్‌ స్టేషన్‌లోని పోలీసులు చెప్పారు. బాధితురాలు తనకుతానుగా వెళ్లిపోయిందని పోలీస్‌ అధికారులు దిశ కుటుంబ సభ్యులను అవమానించారు. వారు మరో పోలీస్‌ స్టేషన్‌కి వారు వెళ్లాల్సి వచ్చింది. అయితే తిరిగి అదే పోలీస్‌ స్టేషన్‌కు దిశ కుటుంబ సభ్యులు రావల్సి వచ్చింది.

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి  మాట్లాడుతూ.. ఐపీసీ, సీఆర్‌పీసీల సవరణ కోసం సూచనలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు రాసిందని,  అలాగే న్యాయశాఖ, పోలీసు విభాగం నుంచి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరిందని తెలిపారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థకు బాధ్యత అప్పగించాం. ఐపీసీ, సీఆర్‌పీసీల సవరణ ముసాయిదా కూడా సిద్ధంగా ఉంది. వీటిని త్వరలో సవరించి, కఠినంగా మారుస్తాం అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు  ఐపీసీ కోడ్‌ను, సీఆర్‌పీసీ కోడ్‌ను సవరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇది జాతీయ అంశంగా మారిందని, ఈ చట్టాన్ని సవరించి, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి 30 రోజుల్లో ఈ కేసులను విచారించి శిక్ష పడేలా చేయాలని కోరారు.