బిచ్చగాడు కాదు లక్షాధికారి..

బిచ్చగాడు చేతిలో ఓ రూపాయి లేక పదిరూపాయి ఉంటాయి.. కాని అదే బిచ్చగాడి దగ్గర వేలల్లో ఉంటే.. ఏమనాలి... అందులోనూ చాలా చెల్లని నోట్లు ఉంటే.. ఇక మీరే చదవండి...!

బిచ్చగాడు కాదు లక్షాధికారి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 7:15 PM

బిచ్చగాడు చేతిలో ఓ రూపాయి లేక పదిరూపాయి ఉంటాయి.. కాని అదే బిచ్చగాడి దగ్గర వేలల్లో ఉంటే.. ఏమనాలి… అందులోనూ చాలా చెల్లని నోట్లు ఉంటే.. ఇక మీరే చదవండి…! కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలో శ్రీను అనే బిచ్చగాడి దగ్గర భారీ మొత్తంలో పాతనోట్లు లభ్యమయ్యాయి. కొంతకాలంగా శ్రీను అనే బిచ్చగాడు భిక్షటాన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.. అయితే శ్రీను మహబూబ్‌ నగర్‌ నుంచి డోన్‌కి వచ్చి 16 సంవత్సరాల నుంచి భిక్షటాన చేస్తున్నాడు. మానసిక స్థితి కూడా సరిగా లేకపోవటంతో రోడ్లపై తిరుగుతూ ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవటం.. అంతే అతడికి తెలిసింది. తనకంటూ ఎవరూ లేక పపోవటంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టే తన ఇళ్లు..

అయితే గత కొంత కాలంగా ద్రోణచల సేవ సమితి భిక్షటన చేసుకునేవారికి సేవలు అందిస్తుంటారు.. అయితే శ్రీనుకి సాన్నం చేయించుటకు ప్రయత్నిస్తుండగా అతడు దాదాపు పదిహేను చొక్కాలు వేసుకుని ఉన్నాడు.. చొక్కా విప్పి చూడగా అతని జేబులో కవర్ల నిండా కట్టల కట్టలుగా డబ్బులు కనిపించాయి.. మొత్తం బయటకు తీసి లెక్కించగా చెల్లని పాతనోట్లు 77వేల 5వందలు ఉన్నాయి..