బ్యానర్‌పై సీరియస్… ఐసీసీకి బీసీసీఐ కంప్లైంట్

ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్- శ్రీలంక మ్యాచ్‌లో ఓ బ్యానర్ కలకలం రేపింది. మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో స్టేడియం పై నుంచి ఓ విమానం వెళ్లింది. అయితే ఆ విమానానికి ఉన్న బ్యానర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఫ్లెక్సీలో కశ్మీర్‌లో భారత అణచివేతకు స్వస్తి చెప్పి.. కశ్మీర్‌కు విముక్తి కల్పించాలంటూ ఉంది. అయితే ఈ ఘటనపై స్పందించిన బీసీసీఐ..ఐసీసీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. తమ ఆటగాళ్ల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. […]

బ్యానర్‌పై సీరియస్... ఐసీసీకి బీసీసీఐ కంప్లైంట్
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2019 | 5:29 PM

ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్- శ్రీలంక మ్యాచ్‌లో ఓ బ్యానర్ కలకలం రేపింది. మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో స్టేడియం పై నుంచి ఓ విమానం వెళ్లింది. అయితే ఆ విమానానికి ఉన్న బ్యానర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఫ్లెక్సీలో కశ్మీర్‌లో భారత అణచివేతకు స్వస్తి చెప్పి.. కశ్మీర్‌కు విముక్తి కల్పించాలంటూ ఉంది.

అయితే ఈ ఘటనపై స్పందించిన బీసీసీఐ..ఐసీసీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. తమ ఆటగాళ్ల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరింది. “మ్యాచ్ సమయంలో ఇది జరగటం చాలా దురదృష్టకరం. ఈ విషయంపై మేము వెంటనే ఐసీసీకి ఫిర్యాదు చేశాము. మాకు అన్నింటికంటే ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని మేము లేఖలో పేర్కొన్నాం.” అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.