AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్‌లో కన్య రాశి వారికి డబ్బు, ఉద్యోగంలో పురోగతి.. శుభవార్తలు వినే అవకాశం!

Kanya Rasi (Virgo) Monthly Horoscope October 2026: అక్టోబర్‌లో కన్య రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో పాటు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపించవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు, ఉద్యోగం మరియు వివాహ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి.

అక్టోబర్‌లో కన్య రాశి వారికి డబ్బు, ఉద్యోగంలో పురోగతి.. శుభవార్తలు వినే అవకాశం!
Kanya Rasi Monthly Horoscope October 2026
Janardhan Veluru
|

Updated on: Sep 30, 2026 | 5:48 PM

Share

కన్యా రాశి అక్టోబర్ 2026 మాసఫలాలు: అక్టోబర్ నెలలో కన్య రాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటంతో అనేక విషయాల్లో సానుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో, ధన స్థానాధిపతి శుక్రుడు కూడా ధన స్థానంలో ఉండటంతో ఆర్థికంగా మంచి మార్పులు చోటుచేసుకోవచ్చు. లాభ స్థానంలో గురువు సంచారం కూడా ఆదాయ వృద్ధికి అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి.

ఈ నెలలో అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. ఆదాయం క్రమంగా పెరిగే సూచనలు ఉన్నాయి. జీవితం కొత్త మలుపు తిరిగేలా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకోవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించవచ్చు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఏర్పడవచ్చు. అవసరమైన సమయంలో కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేసే పరిస్థితి రావచ్చు.

ఇవి కూడా చదవండి

కుటుంబ విషయాల్లో కూడా ఈ నెల సానుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువు, ఉద్యోగం లేదా ఇతర రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆరోగ్యపరంగా గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. దుర్గాదేవిని తరచూ అర్చించడం, సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శని, కుజుల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని జ్యోతిష్య విశ్వాసం.

గమనిక: ఈ కథనంలోని జ్యోతిష్య ఫలితాలు సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవాలుగా పరిగణించకూడదు.

Follow Us