AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్‌లో సింహ రాశికి మిశ్రమ ఫలితాలు.. ఉద్యోగంలో పురోగతి, ఆరోగ్యంపై జాగ్రత్త!

Simha Rasi (Leo) Monthly Horoscope October 2026: అక్టోబర్‌లో సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అష్టమ శని ప్రభావంతో పనుల్లో ఆలస్యం ఉన్నప్పటికీ ఉద్యోగం, వృత్తిలో పురోగతి సాధించవచ్చు. వ్యాపార రాబడి పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ద్వితీయార్థంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

అక్టోబర్‌లో సింహ రాశికి మిశ్రమ ఫలితాలు.. ఉద్యోగంలో పురోగతి, ఆరోగ్యంపై జాగ్రత్త!
Simha Rasi Monthly Horoscope October 2026
Janardhan Veluru
|

Updated on: Sep 30, 2026 | 5:42 PM

Share

అక్టోబర్ నెలలో సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అష్టమ శని ప్రభావం కారణంగా ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు కొంత ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. అయితే నెల ప్రథమార్థంలో రాశ్యధిపతి రవి ధన స్థానంలో ఉండటం వల్ల ఆదాయం, ఆరోగ్య విషయాల్లో కొంత అనుకూల పరిస్థితి కనిపించే అవకాశముంది.

ఉద్యోగ, వృత్తి రంగాల్లో శుక్రుడు, బుధుడి అనుకూలతతో పురోగతి సాధించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు చేపట్టడంతో పాటు కెరీర్‌లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. వ్యాపారులకు రాబడి కొంత పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే ఛాన్స్ ఉంది.

అయితే ద్వితీయార్థంలో రవి తృతీయ స్థానంలో బలహీనంగా ఉండటం వల్ల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున ఆహారం, విశ్రాంతి విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది.

ఇవి కూడా చదవండి

సప్తమ స్థానంలో రాహువు ప్రభావం కారణంగా దాంపత్య జీవితంలో అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు లేదా ఒడిదుడుకులు రావచ్చు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓర్పు పాటించడం మంచిది. కుటుంబ జీవితం మాత్రం మొత్తంగా సాఫీగానే సాగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

కొంత శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు తగ్గుతాయని జ్యోతిష్య విశ్వాసం.

గమనిక: ఈ కథనంలోని జ్యోతిష్య ఫలితాలు సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవాలుగా పరిగణించకూడదు.

Follow Us