AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

October 2026: అక్టోబర్‌లో మిథున రాశి వారికి ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుడ్‌న్యూస్

Mithuna Rasi (Gemini) October 2026 Horoscope: అక్టోబర్‌లో మిథున రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గడంతో పాటు నిరుద్యోగులకు మంచి ఆఫర్ లభించవచ్చు. వ్యాపారాలు లాభాల బాట పట్టే సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉండగా, ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త అవసరం.

October 2026: అక్టోబర్‌లో మిథున రాశి వారికి ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుడ్‌న్యూస్
Mithuna Rasi (Gemini) October 2026 Horoscope:
Janardhan Veluru
|

Updated on: Sep 30, 2026 | 5:27 PM

Share

అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటంతో అనేక విషయాల్లో సానుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ధన స్థానంలో ఉన్న గురువు ఆదాయ వృద్ధికి అనుకూలంగా ఉండగా, రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తూ శుభ ఫలితాలకు బలం చేకూర్చే సూచనలు ఉన్నాయి. దీంతో నెలంతా జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతుంది.

వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి తగ్గి ఉపశమనం లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలకు మంచి స్పందన లభించి ఉద్యోగ ఆఫర్ అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఆర్థికంగా ఈ నెల మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు లేదా షేర్లలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తగిన పరిశీలనతో ముందుకు సాగవచ్చు. అయితే ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా సొంత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ఈ నెలలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యక్రమాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించాలి.

జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. పిల్లలు చదువు, కెరీర్ వంటి విషయాల్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయని జ్యోతిష్య విశ్వాసం.

గమనిక: ఈ కథనంలోని జ్యోతిష్య ఫలితాలు సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవాలుగా పరిగణించకూడదు.

Follow Us