AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

October 2026: అక్టోబర్‌లో వృషభ రాశి వారి పంట పండనుంది..ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు..

Vrishabha Rasi (Taurus) October 2026 Horoscope: అక్టోబర్‌లో వృషభ రాశి వారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు, వ్యాపారంలో లాభాలు, ఆదాయ వృద్ధి వంటి శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. అయితే అనవసర ఖర్చులు, ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం.

October 2026: అక్టోబర్‌లో వృషభ రాశి వారి పంట పండనుంది..ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు..
Vrishabha Rasi October 2026 Horoscope
Janardhan Veluru
|

Updated on: Sep 30, 2026 | 5:14 PM

Share

అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి శని, బుధ, రవుల అనుకూల ప్రభావం కారణంగా మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల ద్వితీయార్థం కంటే ప్రథమార్థం మరింత అనుకూలంగా ఉంటుంది. చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ద్వితీయార్థం మాత్రం పెద్దగా ఒడిదుడుకులు లేకుండా సాధారణంగా సాగుతుంది.

ఉద్యోగులకు ఈ నెలలో శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. పదోన్నతులు, జీతభత్యాల పెంపు వంటి విషయాల్లో ఆశించిన ఫలితాలు లభించవచ్చు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. లాభాలు, రాబడి పెరిగే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి.

అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. నెలంతా అనవసర ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు.

కుటుంబ విషయాల్లో పిల్లల కారణంగా కొంత చికాకు లేదా ఆందోళన కలిగే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. చాలాకాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి.

ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయించడం మంచిది. శివార్చన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య విశ్వాసం.

(గమనిక: ఈ కథనంలోని జ్యోతిష్య ఫలితాలు సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవాలుగా పరిగణించకూడదు)

Follow Us