Astrology: ఈ రాశులకు బుధుడితో ఆర్థిక లాభాలు..! ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్

Mercury Transit 2026: జూలై 8 నుంచి ఆగస్టు 5 వరకు బుధుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. ఈ కాలంలో కొన్ని రాశులకు బుధుడు దుస్థానంలో ఉండటంతో ప్రతికూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అయితే బుధుడు ఉచ్ఛ స్థితి లేదా స్వస్థాన ప్రభావం వల్ల మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి శుభవార్తలు, సమస్యల పరిష్కారం, కార్యసిద్ధి, ప్రతిభకు గుర్తింపు, ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

Astrology: ఈ రాశులకు బుధుడితో ఆర్థిక లాభాలు..! ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్
Budh Gochar 2026 Marriage And Job Astrology

Edited By:

Updated on: Jul 09, 2026 | 12:31 PM

Budh Gochar 2026: సాధారణంగా గ్రహ సంచారంలో 3, 6, 7, 8, 12 స్థానాలు బుధుడికి దుస్థానాలుగా పరిగణిస్తారు. బుధుడు జూలై 8 నుంచి ఆగస్టు 5 వరకు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ మిథున రాశి దుస్థానమైన రాశులకు చెడు ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఉచ్ఛ, స్వస్థానాల్లో మాత్రం బుధుడు దుస్థానాల్లో ఉన్నా కింద శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వినడం, సమస్యలు పరిష్కారం కావడం, ప్రయత్నాలు సఫలం కావడం, ప్రజ్ఞాపాటవాలు వెలుగులోకి రావడం, షేర్లు లాభించడం వంటివి జరుగుతాయి. మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు ఈ యోగాలు పట్టే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి తృతీయ, షష్ట స్థానాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో ప్రవేశించినప్పటి నుంచి శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. తోబుట్టువులకు సామరస్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో బుధ సంచారం వల్ల అదనపు ఆదాయాన్ని భద్రపరచుకోవడం, విలు వైన వస్తు సామగ్రిని, వస్త్రాభరణాలను కొనడం, అధికారులకు, రాజకీయ నాయకులకు ఒక సలహాదారుగా వ్యవహరించడం, మధ్యవర్తిత్వాలు నెరపడం, కొత్త వ్యాపారాల్లో ప్రవేశించడం వంటివి జరుగుతాయి. ఊహించని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు వీరి సలహాలు, సూచనలు లబ్ధిని చేకూరుస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలుగుతాయి.
  3. వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో బుధ సంచారం వల్ల ఒక సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయ వృద్ధికి వినూత్న మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. సమస్యలు, ఒత్తిళ్లు తగ్గిపోతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, గృహ సంబంధమైన ఒప్సందాలు కుదురుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి.
  4. ధనుస్సు: సాధారణంగా ఏ రాశివారికైనా సప్తమ స్థానంలో బుధ సంచారం చెడు ఫలితాలనిచ్చే అవకాశమే ఉంటుంది. అయితే, బుధుడికి ఇది స్వస్థానమైనందువల్ల ఈ రాశివారికి కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. బంధువర్గంలోని వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో బుధ సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు వసూలవుతాయి. బంధుమిత్రులకు శుభ కార్యాల్లో ఆర్థిక సహాయం అందిస్తారు. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.

(Disclaimer: ఈ కథనంలోని జ్యోతిష్య సమాచారం జ్యోతిష్య శాస్త్రంలోని సాధారణ విశ్వాసాలు, గ్రహ సంచారాల ఆధారంగా అందించబడింది. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. దీనిని కేవలం సమాచారం కోసం మాత్రమే పరిగణించండి)

Also Read: ఆషాఢంలో ఈ రాశుల వారికి అదృష్ట పంట..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Follow Us