Astrology: గ్రహాల కీలక మార్పులు.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం, భారీ ధనలాభాలు! మీ రాశి ఇదేనా..?

July Planetary Transit: జూలై చివరి వారంలో బుధుడు మార్గి గమనంలోకి, శని వక్రగతిలోకి ప్రవేశించనున్నాయి. ఈ కీలక గ్రహ మార్పుల ప్రభావంతో మిథునం, సింహం, వృశ్చికం రాశుల వారికి ఆర్థిక లాభాలు, కెరీర్‌లో పురోగతి, కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Astrology: గ్రహాల కీలక మార్పులు.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం, భారీ ధనలాభాలు! మీ రాశి ఇదేనా..?
July Planetary Transit

Updated on: Jul 15, 2026 | 9:54 PM

July End Planetary Transits: జూలై చివరి వారంలో జ్యోతిష్య పరంగా రెండు ప్రధాన గ్రహాల కదలికలు చోటుచేసుకోనున్నాయి. ఇవి కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావం చూపే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జూలై 24న బుధుడు తన తిరోగమన (Retrograde) స్థితిని ముగించి మార్గి (ప్రత్యక్ష) గమనంలోకి ప్రవేశిస్తాడు. దీంతో బుధుడికి సంబంధించిన విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్, ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న ఆటంకాలు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే జూలై 27న శని దేవుడు వక్రగతిలోకి ప్రవేశించనున్నాడు. శని తన వక్రగతిని 2026 డిసెంబర్ 11 వరకు కొనసాగిస్తాడు. ఈ రెండు గ్రహాల కదలికల ప్రభావంతో ముఖ్యంగా మిథునం, సింహం, వృశ్చికం రాశుల వారికి శుభఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిథున రాశి

మిథున రాశికి అధిపతి అయిన బుధుడు ప్రత్యక్ష గమనంలోకి రావడం ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు లభించవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడం ప్రారంభమవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశముంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. పెట్టుబడుల ద్వారా ఆశించిన లాభాలు పొందే అవకాశం ఉంది.

సింహ రాశి

సింహ రాశికి బుధుడు ధనస్థానం, లాభస్థానాలకు అధిపతి. ప్రస్తుతం లాభస్థానంలో ఉన్న బుధుడు ప్రత్యక్ష గమనంలోకి రావడంతో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకోవచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు బలపడతాయి. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన డీల్స్ లభించవచ్చు. పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు రావచ్చు. కుటుంబంలో నెలకొన్న పాత విభేదాలు పరిష్కారమై ప్రశాంత వాతావరణం ఏర్పడవచ్చు. సామాజికంగా గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి బుధుడు ప్రత్యక్ష గమనంలోకి రావడం వల్ల కెరీర్, ఆర్థిక రంగాల్లో ఊహించని అవకాశాలు లభించవచ్చు. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశముంది. వ్యాపార విస్తరణకు చేపట్టిన ప్రణాళికలు విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, బాధ్యతలు రావచ్చు. ఇప్పటి వరకు ఎదురైన వృత్తిపరమైన ఇబ్బందులు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు, ఫలితం లభించే అవకాశం ఉంది.

(Disclaimer: ఈ సమాచారం జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడిన సాధారణ ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, దశ, గోచారం వంటి అంశాలను బట్టి ఫలితాలు మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us