Love Horoscope: ఈ నెలలోనే వారికి ప్రేమ, పెళ్లి యోగాలు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

July 2026 Love and Marriage Horoscope: జూలై నెలలో కొన్ని రాశుల వారికి ప్రేమ, వివాహ వ్యవహారాల్లో శుభయోగాలు ఏర్పడనున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం సప్తమ స్థానం, సప్తమాధిపతి అనుకూలంగా ఉండటంతో కొన్ని రాశుల వారికి ప్రేమ సంబంధాలు బలపడటంతో పాటు వివాహ ప్రయత్నాలు కూడా సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు.

Love Horoscope: ఈ నెలలోనే వారికి ప్రేమ, పెళ్లి యోగాలు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
July 2026 Love And Marriage Horoscope

Edited By:

Updated on: Jul 04, 2026 | 12:15 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం సప్తమ స్థానం, సప్తమాధిపతి వైవాహిక జీవితం గురించి చెబుతాయి. ఈ రెండూ అనుకూలంగా ఉన్న పక్షంలో వైవాహిక జీవితం లేదా దాంపత్య జీవితం నిత్యకల్యాణం పచ్చ తోరణంగా సాగిపోతాయి. ఈ రెండు స్థానాల అనుకూలతతో పెళ్లి జీవితం విజయవంతం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా పురోగమిస్తాయి. జూలై నెలంతా కొన్ని రాశులకు సప్తమాధిపతి, సప్తమ స్థానం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆ రాశుల వారికి ప్రేమలు, పెళ్లిళ్లపరంగా యోగదాయక జీవితం ఏర్పడుతుంది. మేషం, వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, ధనూ రాశులకు ఈ విషయంలో శుభ యోగాలు కలిగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రుడు ఈ నెలంతా చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం చేస్తున్నందు వల్ల కుటుంబ, దాంపత్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. వివాహ బంధానికి సంబంధించిన కోర్టు కేసులు కూడా రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. ఈ రాశికి చెందిన అవివాహితులకు కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమలో పడడానికి, ప్రేమ వివాహం జరగడానికి కూడా బాగా అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన కుజుడు ఇదే రాశిలో ఉండడం వల్ల జీవిత భాగస్వామి మీద ప్రేమ బాగా పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ద్వారా వస్తు లాభాలు కూడా పొందుతారు. పెళ్లికి సంబంధించిన కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రేమ వ్యవ హారాలు తప్పకుండా పెళ్లికి దారితీస్తాయి. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
  3. మిథునం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన గురువు కుటుంబ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నం దువల్ల వైవాహిక జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. దంపతుల మధ్య ఎటు వంటి సమస్యలున్నా పెద్దల మధ్యవర్తిత్వంతో పరిష్కారమవుతాయి. అన్యోన్యత బాగా పెరుగు తుంది. ఉన్నతస్థాయికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధువర్గంలో ఆశించిన వ్యక్తితో వివాహమయ్యే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశికి సప్తమాధిపతి అయిన గురువు ఉచ్ఛస్థితిలో లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి వైవాహిక, దాంపత్య జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఎటువంటి విభేదాలు, పొరపచ్చాలున్నా పెద్దల జోక్యంతో తప్పకుండా పరిష్కారమవుతాయి. సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఈ రాశివారు తప్పకుండా తోటి ఉద్యోగితో గానీ, పరిచయం ఉన్న వ్యక్తితో గానీ ప్రేమలో పడడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ నెలంతా దంపతుల మధ్య అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి పదోన్నతులు లభించడం, జీతభత్యాలు పెరగడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, ప్రభుత్వం వంటి రంగాల్లో పనిచేసే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగితో ప్రేమలో పడడానికి కూడా అవకాశం ఉంది.
  7. ధనుస్సు: ఈ రాశికి సప్తమాధిపతి అయిన బుధుడు ఈ నెలంతా సప్తమ స్థానంలోనే సంచారం చేస్తున్నం దువల్ల ఈ రాశివారి వైవాహిక జీవితానికి భంగమేమీ ఉండదు. ఎటువంటి సమస్యలున్నా పెద్దల సహాయంతో పరిష్కారమవుతాయి. ప్రేమలో పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వ్యాపారంలో ఉన్న వ్యక్తితో గానీ, ఆర్థిక రంగంలో పనిచేస్తున్న వ్యక్తితో గానీ ప్రేమలో పడడం జరుగుతుంది. వీరి ప్రేమ తప్పకుండా పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. సమస్యలు, ఒత్తిళ్లు వగైరాలు ఉండకపోవచ్చు.

Also Read: ఈ రాశులకు శుక్ర దశ మొదలయ్యింది.. ఇక వారికి పట్టిందల్లా బంగారమే..!

Follow Us