AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారి ప్రేమ వ్యవహారాలు సక్సెస్.. ఈ రోజు దినఫలాలు..

జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. వారంతా రాశి ఫలాలతోనే రోజును ప్రారంభిస్తారు. వాటి ద్వారానే కార్యక్రమాలను మెదలు పెట్టడం లేదా పనులను వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తారు. ఈరోజు (బుధవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశుల వారి ప్రేమ వ్యవహారాలు సక్సెస్.. ఈ రోజు దినఫలాలు..
Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 09, 2023 | 7:15 PM

Share

జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. వారంతా రాశి ఫలాలతోనే రోజును ప్రారంభిస్తారు. వాటి ద్వారానే కార్యక్రమాలను మెదలు పెట్టడం లేదా పనులను వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తారు. ఈరోజు (బుధవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేసే విషయంలో హామీలు ఉండవద్దు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవుతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బందిపెడతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగంలో మీ ప్రాభవం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధార పడతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వృత్తి నిపుణులకు బాగానే ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. స్నేహితురాలి మీద బాగా ఖర్చు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆస్తుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవు తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపు పోతుంది. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా గడిచిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

మానసికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ అవసరాలకు మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. ఒకరిద్దరు సన్నిహితులు ఇరకాట పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధువులు మీ సహాయ సహకారాలు ఆశిస్తారు. ఆరోగ్యం అనుకూలి స్తుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. స్నేహితురాలికి కానుకలు కొనిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

చిన్నపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. బాగా దగ్గర వారికి సహాయం చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపు వస్తుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెళతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారంలో భాగస్వాములు కలసి వస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించినంతగా అనుకూలించవు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనులలో బంధుమిత్రుల సహాయం ఉంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో రాణించడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా ముందుకు వెళతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపారం నిలకడగా సాగుతుంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబ విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో శుభవార్త వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ముఖ్యమైన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. హామీలు ఇవ్వడం, వాగ్దానాలు చేయడం ప్రస్తుతానికి మంచిది కాదు. ఉద్యోగ పరంగా కొంత మేలు జరుగుతుంది. వ్యాపార పరిస్థితి బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మంద పొడిగా ముందుకు సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రోజు సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు వెళుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది లేదు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేసి అందుతుంది. విద్యార్థులకు అన్ని విధాలా బాగుంటుంది. హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

నోట్‌: రాశిఫలాలు అనేవి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us