నవంబర్ 17 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, ఆదాయంలో భారీ పురోగతి!

Horoscope Today (November 17, 2026): మంగళవారం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా బాగా కలిసిరానుంది. మరికొందరికి కొత్త అవకాశాలు, ఆదాయ వృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబం, ఆరోగ్యం, వృత్తి, వ్యాపార విషయాల్లో 12 రాశుల వారికి గ్రహగతులు ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి? మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి.

నవంబర్ 17 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, ఆదాయంలో భారీ పురోగతి!
Today Horoscope 17 Nov 2026

Edited By:

Updated on: Nov 17, 2026 | 6:00 AM

దిన ఫలాలు (నవంబర్ 17, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆదాయ వృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. కొందరు మిత్రుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. మాటకు, చేతకు సర్వత్రా విలువ పెరుగుతుంది. కొన్ని దైవ కార్యాలలో పాల్గొంటారు. కుటుంబ జీవితం బాగా సాఫీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులు కొద్దిగా ఓర్పుతో ప్రయత్నాలు కొనసాగించాలి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆదాయ వృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరి ష్కారమై, ఊరట చెందుతారు. జీవిత పురోభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు, నిర్ణయాలు కార్య రూపం దాల్చుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థికపరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ లాభిస్తుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుంచి గౌరవాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యల్ని అధిగ మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలు కూడా లాభసాటిగా పురోగతి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. సాధారణ సమస్యలకు కూడా ఆందోళన చెందడం, ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదని గ్రహించండి. కుటుంబ, ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవ హారాలు నిలకడగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు చక్కబడతాయి. అనుకోకుండా ఒకటి రెండు ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. శుభ కార్యాల మీదా, పుణ్య కార్యాల మీదా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించడం మంచిది. పిల్లలకు సంబం ధించి ఒక శుభ సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. వ్యక్తిగత జీవితంలో పురోగతి వేగం పుంజు కుంటుంది. మీ సలహాలు, సూచనలు బంధుమిత్రులకు ఉపయోగపడతాయి. ఎటువంటి ముఖ్య వ్యవహారాన్నయినా తేలికగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సానుకూల దృక్పథంతో వ్యవ హరించడం మంచిది. వ్యాపారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. మాట చెల్లుబాటు అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. కొత్త మదుపులు, పెట్టుబడుల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతాయి. ఆర్థికంగా ఇతరులకు హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం శ్రేయస్కరం కాదు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇతరుల బాధ్యతలు మీద వేసు కోవడం వల్ల లాభం ఉండకపోవచ్చు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా కొద్దిపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందు కుంటారు. తోబుట్టువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరిగి కొన్ని ప్రధానమైన అవసరాలు తీరుతాయి. ఆశలు వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. బంధుమిత్రులతో హ్యాపీగా గడుపుతారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం పెరిగి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహ కాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కునే సూచనలున్నాయి. ఆర్థిక ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. అనుకూల ఫలితాలుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us