ఆగస్టు 21 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు
Horoscope Today (August 21, 2026): శుక్రవారం మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి దిన ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి వారికి ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపించడంతో పాటు కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉన్నప్పటికీ వ్యక్తిగత సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు, ఆశించిన దానికంటే మెరుగైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మిగిలిన రాశుల వారికి కూడా గ్రహస్థితుల ఆధారంగా ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

దిన ఫలాలు (ఆగస్టు 21, 2026): మేష రాశి వారు కొద్ది శ్రమతో ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాగా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కు వగా కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొద్ది శ్రమతో ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప డతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసర పరిచయాలు ఏర్పడడం, స్వల్ప అనారోగ్యానికి గురికావడం వంటివి జరిగే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహ కారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. బంధు మిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బాగా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కు వగా కలిసి వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధన లాభా నికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవ హారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో మంచి పేరు, గుర్తింపు లభిస్తాయి. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుం డదు. బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరు గుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగు తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబంలో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడ తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమ వుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో బాగా ఎక్కువగా పాల్గొంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా, సామరస్యంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కొందరు సన్నిహి తులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. రహస్య శత్రువులు తయారయ్యే సూచనలున్నాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందు తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలి స్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ పెద్దలతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో భద్రత, స్థిరత్వం లభిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మిత్రుల సహా యంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి సంబం ధించి శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. వ్యసనా లకు, అనవసర స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. కుటుం బపరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. మిత్రుల వల్ల కొద్దిగా మోసపోయే సూచనలున్నాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. పిల్లలు లేనివారికి సంతాన యోగం పట్టే అవకాశం కూడా ఉంది. కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి సమయం అనుకూలంగా ఉంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయం బాగానేఉంటుంది. నష్టదాయక వ్యవహారాల్ని తగ్గించుకోవడం మంచిది. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది.



