
దిన ఫలాలు (ఆగస్టు 15, 2026): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల విషయంలో శుభవార్తలు వింటారు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మీ సలహాల వల్ల బంధుమిత్రులు లబ్ధి పొందుతారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి.
ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అవకాశాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కొందరు మిత్రులవల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమలు ఊపందుకుంటాయి.
వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలమవు తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. చేపట్టిన ప్రయత్నాలు ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కార మవుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగు తాయి. కుటుంబపరంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. సమాజంలో మంచి పరిచ యాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కూడా విశ్రాంతి లేని పరిస్థితు లుంటాయి. ఇంటా బయటా పనిభారం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా, సంపూర్ణంగా సాగకపో వచ్చు. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగానే ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండకపోవడం చాలా మంచిది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. ప్రతి చిన్న పనికీ ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని స్వయంగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఆదాయ పరి స్థితి అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చదు వుల్లో పిల్లల పనితీరు పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి ఉంటుంది.
రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్య మైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, ఆర్థిక సమస్యలు పరి ష్కారం కావడం వంటివి జరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు నిదానంగా పురోగమిస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కార ణంగా కాస్తంత మానసిక ఒత్తిడికి గురవుతారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుల్లో శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగతి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి పని, ప్రతి ప్రయత్నం సఫలం అవుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుం బంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు, తల్లితండ్రుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడుస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా పని ఒత్తిడి, పని భారం తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఏలిన్నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యమవుతుంటుంది. కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు.
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.