
Black Thread on Leg Belief Telugu: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో ఎన్నో ఆచారాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిలో కాలికి నల్ల దారం కట్టుకోవడం కూడా ఒకటి. ఒకప్పుడు పెద్దలు పాటించే ఆచారంగా ఉన్న ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు యువత సైతం ఫ్యాషన్‌గా అనుసరిస్తున్నారు. అయితే, కాలికి నల్ల దారం కట్టుకోవడం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు.. దీని వెనుక ఆధ్యాత్మిక, జ్యోతిష్యపరమైన ప్రాధాన్యతలు ఉన్నాయని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా చెడు దృష్టి నుంచి రక్షణ పొందడానికి, ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి నల్ల దారాన్ని ధరిస్తారు.
హిందూ సంప్రదాయాల ప్రకారం నలుపు రంగు ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని దూరంగా ఉంచుతుందని విశ్వసిస్తారు. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటారు. తరచూ అలసటగా అనిపించడం, పనుల్లో ఆటంకాలు ఎదురవడం, అనారోగ్య సమస్యలు రావడం వంటి వాటికి దృష్టి దోషం కూడా ఒక కారణమని కొందరు భావిస్తారు. ఇలాంటి ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ పొందేందుకు నల్ల దారం కట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
కాశీ సంప్రదాయంలో నల్ల దారాన్ని ‘కాశీ దారం’ అని కూడా పిలుస్తారు. మత విశ్వాసాల ప్రకారం, నల్ల దారం కాలభైరవుడి రక్షణకు ప్రతీకగా భావిస్తారు. కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా, భక్తులను కాపాడే దేవుడిగా పూజలు అందుకుంటారు. మరోవైపు జ్యోతిష్య శాస్త్రంలో నలుపు రంగును శని గ్రహానికి ప్రతీకగా పరిగణిస్తారు. పాదాలకు నల్ల దారం కట్టుకోవడం వల్ల శని, రాహు, కేతు గ్రహాలకు సంబంధించిన ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని కొందరి నమ్మకం.
సంప్రదాయ విశ్వాసాల ప్రకారం నల్ల దారం కట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తారు.
ప్రస్తుతం చాలామంది మహిళలు నల్ల దారంతో కూడిన వెండి కాలి పట్టీలు, పైరైట్ రాళ్లు కలిగిన పట్టీలను కూడా ధరిస్తున్నారు. సంప్రదాయ నమ్మకాల ప్రకారం నలుపు రంగు దృష్టి దోషాన్ని నివారిస్తే, వెండి శుభప్రదమైన లోహంగా పరిగణించబడుతుంది. పైరైట్ సంపద, సానుకూలతకు ప్రతీకగా భావిస్తారు. వీటిని ధరించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి, ఆర్థికంగా కలిసి వస్తుందని కొందరి విశ్వాసం.
(Disclaimer: కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మతపరమైన, జ్యోతిష్యపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయంగా నిరూపితమైన ఆధారాలు లేవు. ఈ కథనం కేవలం సమాచారం, సంప్రదాయాల అవగాహన కోసం మాత్రమే.)