
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన బల్గేరియన్ ఆధ్యాత్మికవేత బాబా వంగా పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రతి సంవత్సరం ఆమె పేరిట అనేక అంచనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా 2026 సంవత్సరం సెకండ్ హాఫ్, అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఐదు రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ కాలంలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, సామాజిక గౌరవం వంటి అంశాల్లో విశేష పురోగతి ఉంటుందని పేర్కొంటున్నారు. మరి ఆ రాశులు ఏవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రతయ్నం చేద్దాం..
బాబా వంగా అంచనాల ప్రకారం.. వృషభ రాశి వారికి 2026 చివరి ఆరు నెలలు అత్యంత అనుకూలంగా ఉండొచ్చు. ఆదాయం పెరగడం, కొత్త అవకాశాలు రావడం, ఆర్థికంగా బలపడే పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు. పెట్టుబడుల ద్వారా కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
సింహ రాశి వారికి గతంలో ఎదురైన కొన్ని సమస్యలు తగ్గుముఖం పట్టి, వృత్తి జీవితంలో పురోగతి సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలు, పరిపాలన, నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారికి గుర్తింపు, పదవిలో పురోగతి లభించవచ్చని ప్రచారం జరుగుతోంది.
కన్య రాశి వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, వ్యాపార విస్తరణకు అనుకూల సమయం ఉంటుందని చెబుతున్నారు. ఆదాయం పెరగడంతో పాటు పొదుపు చేసే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని వైరల్ కథనాలు పేర్కొంటున్నాయి.
వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఆదాయం పెరగడం, పదోన్నతి అవకాశాలు రావడం, ఊహించని ఆర్థిక లాభాలు కలగడం వంటి అంశాలు చోటుచేసుకోవచ్చని అంటున్నారు. వ్యాపారవేత్తలకు కూడా ఈ సమయం లాభదాయకంగా ఉండే అవకాశముందని పేర్కొంటున్నారు.
మకర రాశి వారికి చాలా కాలంగా చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కే సమయం ఇదేనని ప్రచారంలో ఉన్న అంచనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ఆర్థికాభివృద్ధి, సమాజంలో గౌరవం పెరగడం వంటి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవచ్చని చెబుతున్నారు.
నోట్: బాబా వంగా పేరుతో ప్రచారంలో ఉన్న అంచనాలకు అధికారిక లేదా శాస్త్రీయ ఆధారాలు లేవు. పై వివరాలు వివిధ మాధ్యమాల నుంచి సేకరించిన అంచనాల ఆధారంగా మాత్రమే అందించాము. వీటిని విశ్వాసపరమైన సమాచారంగా మాత్రమే పరిగణించాలి.