AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? నెగెటివ్ ఎనర్జీని ఉప్పుతో ఇలా తరిమేయొచ్చట!

Vastu Tips for Home: కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా పనులు సజావుగా సాగకపోవడం, ఇంట్లో ప్రశాంతత తగ్గిపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటే తరచూ గొడవలు, నిద్రలేమి, పీడకలలు, డబ్బు నిలవకపోవడం, కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురికావడం వంటి సంకేతాలు కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? నెగెటివ్ ఎనర్జీని ఉప్పుతో ఇలా తరిమేయొచ్చట!
Negative Energy At Home
Rajashekher G
|

Updated on: May 31, 2026 | 1:42 PM

Share

కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా పనులు అనుకున్నట్లు జరగవు. ఇంట్లో ప్రశాంతత తగ్గిపోవడం, కుటుంబ సభ్యుల మధ్య చిన్నచిన్న విషయాలకే విభేదాలు రావడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడం వంటి పరిస్థితులు చాలామందిని ఆందోళనకు గురిచేస్తాయి. వాస్తు శాస్త్రాన్ని విశ్వసించే వారి అభిప్రాయం ప్రకారం, ఇలాంటి పరిస్థితులకు ఇంట్లోని ప్రతికూల వాతావరణం కూడా ఒక కారణంగా భావిస్తారు. వాస్తు నిపుణుల ప్రకారం, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కొన్ని సాధారణ సంకేతాలు కనిపించవచ్చు. కారణం లేకుండా తరచూ గొడవలు జరగడం, ఇంట్లోకి అడుగుపెట్టగానే భారంగా అనిపించడం, నిద్ర సమస్యలు ఎదురుకావడం, పీడకలలు రావడం వంటివి వాటిలో ముఖ్యమైనవి. అలాగే సంపాదన ఉన్నప్పటికీ డబ్బు నిలవకపోవడం, కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురికావడం, ఇంట్లో పెంచే మొక్కలు సరిగా పెరగకపోవడం వంటి అంశాలను కూడా కొందరు ప్రతికూల శక్తి సంకేతాలుగా భావిస్తారు.

ఉప్పు పరిష్కారం

ఇలాంటి పరిస్థితులను తగ్గించేందుకు వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ఒక గాజు పాత్రలో రాక్ సాల్ట్ లేదా కల్లుప్పు వేసి ఇంట్లోని ఒక మూలలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గుతాయని విశ్వాసం ఉంది. ఈ ఉప్పును వారానికి ఒకసారి మార్చడం మంచిదని సూచిస్తారు. అలాగే ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తుడవడం వల్ల ఇంటి వాతావరణం తాజాగా అనిపిస్తుందని చెబుతారు.

ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా..

అదే విధంగా సాయంత్రం సమయంలో కర్పూరం లేదా సాంబ్రాణి ధూపం వేయడం, ఇంట్లో సరిపడా వెలుతురు ఉండేలా చూసుకోవడం, కిటికీలు తెరిచి స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి లోపలికి వచ్చేలా చేయడం వంటి అలవాట్లు కూడా ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

వాటిని ఇంట్లో ఉంచొద్దు

వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిన అద్దాలు, పగిలిన వస్తువులు, పనిచేయని గడియారాలు వంటి వాటిని ఇంట్లో ఎక్కువకాలం ఉంచకపోవడం మంచిదని చెబుతారు. అలాగే అవసరం లేని పాత సామాన్లను తొలగించి ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం వల్ల సానుకూలత పెరుగుతుందని నమ్మకం.

అయితే, ఇవన్నీ వాస్తు శాస్త్రం, సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సూచనలు మాత్రమే. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కోసం పరిశుభ్రత, మంచి గాలి ప్రసరణ, సానుకూల ఆలోచనలు, పరస్పర అవగాహన కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!