వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబుకు అరెస్ట్ వారెంట్..!

వైసీపీ ఎమ్మెల్యేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబుకు అరెస్ట్ వారెంట్ నోటీసులు జారీ చేసిన ఒంగోలు కోర్టు. చెక్ కేసు విచారణలో భాగంగా.. ఎమ్మెల్యే కోర్టు వాయిదాలకు వరుసగా హాజరుకానందుకు.. ఒంగోలు సంచార న్యాయ స్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబుపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గతంలో ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి ఎమ్మెల్యే చెక్కులిచ్చారు. ఆ చెక్ బ్యాంక్‌లో […]

వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబుకు అరెస్ట్ వారెంట్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 06, 2019 | 7:12 PM

వైసీపీ ఎమ్మెల్యేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబుకు అరెస్ట్ వారెంట్ నోటీసులు జారీ చేసిన ఒంగోలు కోర్టు. చెక్ కేసు విచారణలో భాగంగా.. ఎమ్మెల్యే కోర్టు వాయిదాలకు వరుసగా హాజరుకానందుకు.. ఒంగోలు సంచార న్యాయ స్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబుపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గతంలో ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి ఎమ్మెల్యే చెక్కులిచ్చారు. ఆ చెక్ బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అయ్యింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో.. ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.