Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

మాటల మాంత్రికుడితో సూపర్‌స్టార్ కటీఫ్..! ప్రూఫ్ ఇదేనా..?

Clashes between Mahesh Babu and Trivikram, మాటల మాంత్రికుడితో సూపర్‌స్టార్ కటీఫ్..! ప్రూఫ్ ఇదేనా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువారం 48వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్బంగా సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. త్రివిక్రమ్‌తో పనిచేసిన వారే కాకుండా.. ఆయనపై అభిమానం ఉన్న నటీనటులు కూడా గురూజీకి అభినందనలు తెలిపారు. అయితే త్రివిక్రమ్‌తో పనిచేసిన సూపర్‌స్టార్ మహేష్ బాబు, దేవీ శ్రీ ప్రసాద్ విషెస్ చెప్పకపోవడంపై ఇప్పుడు పలు రకాల పుకార్లు వినిపిస్తున్నాయి.

కాగా మహేష్ బాబుతో అతడు, ఖలేజా రెండు సినిమాలను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఇవి అనుకున్నంత విజయాలను ఇవ్వనప్పటికీ.. మహేష్ కెరీర్‌లో మాత్రం గుర్తుండిపోయే సినిమాల లిస్ట్‌లో ఉంటాయి. అలాగే మహేష్‌తో పలు యాడ్స్‌ను కూడా తెరకెక్కించాడు మాటల మాంత్రికుడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉండేది. అయితే ఏమైందో తెలీదు గానీ రాను రాను ఈ బంధం కాస్త తగ్గుతూ వచ్చింది. ఇక తాజాగా గురూజీ బర్త్‌డేకు విష్ కూడా చేయలేదు మహేష్. మరోవైపు గురువారం లోకనాయకుడు కమల్ పుట్టినరోజు కాగా ఆయనకు విషెస్ చెప్పి, త్రివిక్రమ్‌కు చెప్పకపోవడంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆయనతో పనిచేసి కూడా విషెస్ చెప్పలేదంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై మహేష్ అభిమాన వర్గం మరోలా స్పందిస్తోంది. ఫోన్ చేసి అభినందనలు చెప్పి ఉండొచ్చు కదా అంటూ వారు కవర్ చేస్తున్నారు. ఏదేమైనా మాటల మాంత్రికుడితో సూపర్‌స్టార్‌కు కటీఫ్ అయ్యిందా..? వీరిద్దరి కాంబినేషన్‌లో ఇకపై సినిమాలు రావా..? అన్న ప్రశ్నలు ఫిలింనగర్‌లో బలంగా వినిపిస్తోంది.

మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్ కూడా త్రివిక్రమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పలేదు. నిజానికి చెప్పాలంటే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సమయంలో వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని.. అందులో ‘అఆ’ నుంచి త్రివిక్రమ్, డీఎస్పీతో పనిచేయడం లేదని అప్పట్లో పుకార్లు గట్టిగా వినిపించాయి. కానీ ఈ పుకార్లకు అటు దేవీ శ్రీ, ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ స్పందించారు. కొత్తదనం కోసం తాను డీఎస్పీతో పనిచేయడం లేదని త్రివిక్రమ్ చెప్పగా.. సినిమాలకు పనిచేయనప్పటికీ, ఇప్పటికీ తామిద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతూ ఉందని దేవీ చెప్పుకొచ్చారు. అయినా వీరిద్దరి మధ్య ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తుందని.. అందుకే డీఎస్పీ కూడా త్రివిక్రమ్‌కు విష్ చేయలేదని తెలుస్తోంది. ఇక్కడ ఇంకో విషమేంటంటే గురువారం స్వీటీ అనుష్క పుట్టినరోజు కాగా.. మహేష్, డీఎస్పీ ఇద్దరూ ఆమెకు కూడా విష్ చేయకపోవడం.