ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

AP New Cabinet, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశం.. రైతులు, మహిళలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా సాగింది. ఇందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలేంటో ఇప్పుడు చూద్దాం…

 • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు జూలై 1వ తేదీ నుంచి 27% శాతం మధ్యంతర భృతి పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
 • సీపీఎస్ రద్దు చేసిన పక్షంలో ఆ నిధిని వెనక్కు తీసుకోవడంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించడానికి కమిటీ వేయాలని నిర్ణయించిన కేబినెట్.
 • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
 • గిరిజన సంక్షేమంలోని కమ్మూనిటీ హెల్త్ వర్కర్లకు 400 రూపాయల నుంచి 4 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం.
 • అలాగే మున్సిపల్ కార్మికులు, హోంగార్డ్‌ల వేతనాల పెంపునకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
 • వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయాలని వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లుల ఖాతాల్లోకి రూ.15,000 జమ కానున్నాయి.
 • నామినేటెడ్ పదవులను రద్దు చేయాలంటూ అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్ జగన్.
 • మంత్రులందరూ పారదర్శక పాలన అందించాలని.. ప్రతి శాఖలోనూ అవినీతి జరగకుండా సర్వశక్తులు ఒడ్డాలని మంత్రాలను సూచించారు వైఎస్ జగన్.
 • రైతులకు ఉచిత బోర్లు కోసం 200 రిగ్గుల కొనుగోలు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు ఉచిత బీమా కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
 • ఇల్లు లేని పేదలకు వచ్చే ఉగాదికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలంటూ నిర్ణయం. రాబోయే నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మాణానికి ప్రణాళిక వేయాలంటూ వైఎస్ జగన్ ఆదేశం.
 • అర్హత, అనుభవం ఆధారంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
 • ఆశావర్కర్ల వేతనాల పెంపుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆశావర్కర్ల జీతాలు 10వేల రూపాయలకు పెరగనున్నాయి.
 • సామాజిక పింఛన్లు రూ. 2,250 పెంపునకు కూడా ఆమోదం తెలిపింది.
 •  రైతు భరోసాకు ఆమోదం తెలిపిన కేబినెట్‌.. అక్టోబర్‌ 15 నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం.

గతానికి కంటే భిన్నంగా జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండా‌గా సీఎం వైఎస్ జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలపై స్పష్టతతో, ఆర్థిక పరిస్థితిపై అవగాహనతోనే తొలి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలు తీసుకోగలిగారని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *