ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శ

ఈసీ నిమ్మగడ్డ రమేష్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్ చేశారు. ఎన్నికల కమిషనర్ ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించటం తగదని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించిందని ఈ సందర్భంగా ఆదిమూలపు చెప్పుకొచ్చారు. సుప్రీం ఆదేశాలను నిమ్మగడ్డ ఉల్లంఘించారని, తిరుపతి ఉప ఎన్నికల్లో 3 లక్షల పైచిలుకు మెజార్టీ తో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు.

  • Venkata Narayana
  • Publish Date - 3:36 pm, Fri, 20 November 20