సంపూర్ణ మద్య నిషేదం తర్వాతే ఎన్నికలకు వెళ్తాం : ఏపీ మంత్రి

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. బెల్ట్ షాపులను రద్దు చేసింది, వైన్ షాపుల సంఖ్యను కూడా తగ్గించింది. ఈ నేపధ్యంలో ఖచ్చితంగా దశలవారీగా మద్యాపాన నిషేదం అమలుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదాన్నిపూర్తిగా అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ విధానంపై మంత్రి నారాయణస్వామి, హోం […]

సంపూర్ణ మద్య నిషేదం తర్వాతే ఎన్నికలకు వెళ్తాం : ఏపీ మంత్రి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 06, 2019 | 6:54 PM

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. బెల్ట్ షాపులను రద్దు చేసింది, వైన్ షాపుల సంఖ్యను కూడా తగ్గించింది. ఈ నేపధ్యంలో ఖచ్చితంగా దశలవారీగా మద్యాపాన నిషేదం అమలుకు ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదాన్నిపూర్తిగా అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ విధానంపై మంత్రి నారాయణస్వామి, హోం మంత్రి సుచరితతో కలిసి గుంటూరులో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే దశలవారీగా నిషేదాన్ని అమలు చేస్తున్నామన్నారు. వైన్‌షాపులు భారీగా తగ్గించామని, ఎన్నికల్లో ఇచ్చిన సంపూర్ణ మద్యనిషేదం హమీని ఖచ్చితంగా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

మద్యంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తీవ్రమైన నేరాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు మంత్రి నారాయణస్వామి. రాష్ట్రంలో ఆడపడుచుల బాధలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి జగన్ మద్యపాన నిషేదానికి నిర్ణయం తీసుకున్నారని, అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్నిచేర్చారన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంపూర్ణ మద్యనిషేదం విజయవంతం కావడానికి ప్రజలు సహకరించాలని మంత్రి నారాయణ స్వామి కోరారు.