కరోనా పరీక్షలు.. ఏపీ ఖాతాలో మరో రికార్డు

కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల సంఖ్య 5 లక్షలను దాటేసింది.

కరోనా పరీక్షలు.. ఏపీ ఖాతాలో మరో రికార్డు
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2020 | 2:33 PM

కరోనా పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల సంఖ్య 5 లక్షలను దాటేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 11,602 పరీక్షలు జరగ్గా.. దీంతో రాష్ట్రంలో మొత్తం చేసిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 5,04,889కు చేరింది. ఈ క్రమంలో మరో రికార్డును ఏపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. కరోనా మొదలైనప్పుడే అప్రమత్తమైన ప్రభుత్వం.. ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తుండటంతోనే అధిక కేసులు బయటపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఏపీలో కరోనా రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉండటం మరో గర్వించదగ్గ విషయం.

కాగా ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 4261కి చేరగా.. ప్రస్తుతం 1641 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2540 మంది డిశ్చార్జి కాగా.. మరణాల సంఖ్య 80కు చేరింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో 197 మందికి కరోనా నిర్దారణ అవ్వగా.. వారిలో 176 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 971 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. 564 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

Read This Story Also: కరోనా వైరస్.. అలాంటి మాస్క్‌లు వాడటం ఉత్తమం..!