ఎల్లుండి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఏపీలో ఎల్లుండి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించి రేపు బీఏసీ సమావేశం జరగనుంది. గతం కంటే భిన్నంగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఉదయం 10.30 గం.లకు బీఏసీ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలి. ఏ విధంగా జరపాలని అనే దానిపై రేపు జరిగే బీఏసీలో చర్చించకు రానుంది. ఇదే విషయంపై స్పీకర్ తమ్మినేని సీతారాం వివిధ శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు. మరోవైపు బడ్జెట్ సమావేశాలు […]

ఎల్లుండి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 5:07 PM

ఏపీలో ఎల్లుండి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించి రేపు బీఏసీ సమావేశం జరగనుంది. గతం కంటే భిన్నంగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఉదయం 10.30 గం.లకు బీఏసీ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలి. ఏ విధంగా జరపాలని అనే దానిపై రేపు జరిగే బీఏసీలో చర్చించకు రానుంది. ఇదే విషయంపై స్పీకర్ తమ్మినేని సీతారాం వివిధ శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు.

మరోవైపు బడ్జెట్ సమావేశాలు దాదాపు 15 రోజులపాటు జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో పలు కీలకాంశాలు చర్చకు రానున్నాయి. అదేవిధంగా పది నుంచి 12 బిల్లులను సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 12 వ తేదీన ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయమంత్రి కన్నబాబు కూడా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షపార్టీ టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల విషయం తీవ్ర చర్చకు దారితీసే అవకాశముంది. అలాగే విత్తనాల కొరత కూడా సభలో చర్చకు రానుంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!