చైనాపై ఆగ్రహం.. కిమ్ దిష్టిబొమ్మ దహనం.. నవ్వులు పూయిస్తోన్న బీజేపీ కార్యకర్త..

పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌లో బీజేపీ కార్యకర్తలు చేసే ఓ ర్యాలీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిష్టిబొమ్మ దహనంతో పాటు ఆ నాయకులు మాట్లాడిన తీరు మొత్తం బీజేపీ పరువు తీసింది.

చైనాపై ఆగ్రహం.. కిమ్ దిష్టిబొమ్మ దహనం.. నవ్వులు పూయిస్తోన్న బీజేపీ కార్యకర్త..
Follow us

|

Updated on: Jun 19, 2020 | 5:45 PM

తూర్పు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్, చైనా దళాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. దీనితో యావత్ భారతదేశం డ్రాగన్ కంట్రీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా దేశం తీరును ఎండగడుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, చైనా చొరబాటుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌లో బీజేపీ కార్యకర్తలు చేసే ఓ ర్యాలీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిష్టిబొమ్మ దహనంతో పాటు ఆ నాయకులు మాట్లాడిన తీరు మొత్తం బీజేపీ పరువు తీసింది.

వివరాల్లోకి వెళ్తే.. అసన్సోల్‌ సౌత్ మండల్ 1 బీజేపీ కార్యకర్తలు కొందరు చైనాకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తూర్పు లదాఖ్‌లో జరిగిన ఘటనకు నిరసనగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టిబొమ్మకు బదులు కిమ్ జోంగ్ ఉన్ దిష్టి బొమ్మను తగలబెట్టారు. ‘చైనాకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాం.  చైనీస్ ప్రైమ్ మినిస్టర్ కిమ్ జోంగ్ ఉన్ దిష్టిబొమ్మను తగలబెట్టాం’ అని అసన్సోల్‌ సౌత్ మండల్ 1 అధ్యక్షుడు పేర్కొన్నాడు. ‘ప్రజలందరూ కూడా చైనీస్ ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలని తెలిపారు. కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించి చైనాను బలహీనం చేయాలని కోరారు. జిన్ పింగ్‌కు బదులుగా కిమ్ జోంగ్ ఉన్‌ను చైనా ప్రధానమంత్రి అని ఆ బీజేపీ కార్యకర్త పేర్కోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.