AP News: పార్టీల పరంగా రాజకీయ ప్రత్యర్థులు.. అనుకోకుండా ఎదురుపడ్డారు..

వాళ్ళిద్దరూ గత ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి ఒకరు ఎంపిగా, మరొకరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్లమెంట్‌ పరిధిలో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఎంపి మాత్రం ఈసారి పక్కపార్టీలోకి జంప్‌ చేశారు. ఎమ్మెల్యే మాత్రం అదే పార్టీలో పార్లమెంట్ పరిధిలోని మరో నియోజకవర్గంలో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా ఇద్దరూ ఒకే ఊర్లో అన్నదాన కార్యక్రమంలో తారసపడ్డారు.

AP News: పార్టీల పరంగా రాజకీయ ప్రత్యర్థులు.. అనుకోకుండా ఎదురుపడ్డారు..
Ongole Leaders
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 10, 2024 | 5:27 PM

వాళ్ళిద్దరూ గత ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి ఒకరు ఎంపిగా, మరొకరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్లమెంట్‌ పరిధిలో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఎంపి మాత్రం ఈసారి పక్కపార్టీలోకి జంప్‌ చేశారు. ఎమ్మెల్యే మాత్రం అదే పార్టీలో పార్లమెంట్ పరిధిలోని మరో నియోజకవర్గంలో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా ఇద్దరూ ఒకే ఊర్లో అన్నదాన కార్యక్రమంలో తారసపడ్డారు. అంతే గత ఎన్నికల బంధం గుర్తుకొచ్చింది. ఈసారి చెరోపార్టీలో ఉన్నా విబేధాలు లేకుండా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకున్నారు. మీపార్టీ నుంచి మీరు గెలుస్తారంటే, మీరు కూడా గెలుస్తారంటూ ఒకరినొకరు అడ్వాన్స్‌ గ్రీటింగ్స్‌ చెప్పుకున్నారు. ఒకరు భోజనం చేస్తుంటే మరొకరు ఆయనకు ఎదురుగా కూర్చుని సాధకబాధలు చెప్పుకున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు.

ప్రకాశంజిల్లా కొండపి నియోజకర్గంలోని జాళ్ళపాలెంలో తరునాళ్ళ జరుగుతోంది. ఈ తిరునాళ్ళకు కొండపి నుంచి వైసిపి అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. తిరునాళ్ళ సందర్భంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్థానికులతో కలిసి భోజనం చేశారు. అదే సమయంలో తిరునాళ్ళలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భక్తులకు ఒంగోలు పార్లమెంట్‌ టిడిపి అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డి భోజనం వడ్డిస్తున్నారు. అదే పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్న వైసిపి అసెంబ్లీ అభ్యర్ధి ఆదిమూలపు సురేష్‌ను టిడిపి పార్లమెంట్‌ అభ్యర్ధి మాగుంట చూశారు. వెంటనే మంత్రి సురేష్‌ దగ్గరకు వచ్చి ” హాయ్‌ సురేష్‌ ” బాగున్నావా.. అంటూ అప్యాయంగా పలకరించారు. ప్రత్యర్ధి పార్టీ ఎంపి అభ్యర్ధి మాగుంట తనంతట తాను వచ్చి పలకరించడంతో మంత్రి సురేష్‌ కూడా గౌరవమర్యాదలతో భోజనం చేస్తూనే లేచి మాగుంటకు అభివాదం చేశారు. అనంతరం మంత్రి సురేష్‌కు ఎదురుగా కుర్చీవేసుకుని కూర్చున్నారు మాగుంట. ఇద్దరూ కుశలప్రశ్నలు వేసుకున్న తరువాత ఇద్దరికి మంచే జరుగుతుందని వ్యాఖ్యానించుకున్నారు. ఈ సీన్‌ చూసి ఇటు వైసిపి, అటు టిడిపి నేతలు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఈ ఇద్దరు నేతలను చూసిన జనం మాత్రం రాజకీయ నేతలంతా ఒక్కటే సుమీ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..