Heart Attack: ఆందోళన కలిగిస్తోన్న హార్ట్‌ ఎటాక్‌లు.. గుండెపోటుతో పదవతరగతి విద్యార్దిని మృతి

నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే తుదిశ్వాస విడుస్తున్నారు. తాజా ఓ విద్యార్థి గుండెపోటుకు బలైంది. చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాల్సిన ఒక విద్యా కుసుమం అద్దాంతరంగా కానరాని లోకాలకు వెళ్లిపోయింది. పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

Heart Attack: ఆందోళన కలిగిస్తోన్న హార్ట్‌ ఎటాక్‌లు.. గుండెపోటుతో పదవతరగతి విద్యార్దిని మృతి
Heart Attack
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 19, 2024 | 6:34 PM

నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే తుదిశ్వాస విడుస్తున్నారు. తాజా ఓ విద్యార్థి గుండెపోటుకు బలైంది. చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాల్సిన ఒక విద్యా కుసుమం అద్దాంతరంగా కానరాని లోకాలకు వెళ్లిపోయింది. పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మొదటి పరీక్ష రాసి స్కూల్‌కి వెళ్ళిన ఆ విద్యార్థిని తోటి విద్యార్థులతో మాట్లాడుతూ కుప్పకూలిపోయింది. హఠాత్ పరిణామంతో తోటి విద్యార్థులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు

గుండెపోటుతో టెన్త్ విద్యార్థిని మృతి చెందడంతో కడప జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజుపాలెం మండలంలోని కొర్రపాడులో టెన్త్ విద్యార్థిని లిఖిత (15) గుండెపోటుతో మృతి చెందింది. ఇటివలె మొదలైన పదోవ తరగతి తెలుగు పరీక్ష రాసిన తర్వాత తోటి విద్యార్దులతో పాఠశాలకు వెళ్ళిన లిఖిత విద్యార్దులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి మాట్లాడుతూ కుప్పకూలి పోయింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురావడంతో అప్పటికే విద్యార్దిని లిఖిత మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తోటి విద్యార్దుల , పాఠశాల యాజమావ్యం , తల్లిదండ్రులు ధిగ్బ్రాంతికి గురైయ్యారు.

అప్పటివరకు తమతోనే ఉండి ఒక్కసారిగా కుప్పకూలి కానరాని లోకాలకు వెళ్ళిపోయిన లిఖిత మృతిని తోటి విద్యార్దులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం లిఖితకు చిన్నతనం నుంచే గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే లిఖిత పదవతరగతి పరీక్షల మొదటి రోజే తెలుగు పరీక్ష ఒక్కటే రాసి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..