Andhra Pradesh: భర్త నాలుకను కొరికేసిన భార్య.. కారణం తెలిస్తే గుడ్లు తేలేస్తారు..!

| Edited By: Shiva Prajapati

Jul 21, 2023 | 1:11 PM

భర్త నాలుకను భార్య కొరికింది. ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా దీనిపైన చర్చ. భర్త నోటిలో ఉన్న నాలుకను భార్య ఎలా కొరికింది. విభేదాలు ఉంటే ఇది ఎలా సాధ్యం. ఇద్దరు మౌత్ టు మౌత్ కిస్ చేసుకునే సమయంలో.. భర్త నాలుక భార్య కొరికి ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇష్టం లేకుండా బలవంతంగా భార్యకు ముద్దు పెట్టేందుకు వెళ్లిన భర్త నాలుకను కొరికేసిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లం గుట్ట,,

Andhra Pradesh: భర్త నాలుకను కొరికేసిన భార్య.. కారణం తెలిస్తే గుడ్లు తేలేస్తారు..!
Kissing
Follow us on

భర్త నాలుకను భార్య కొరికింది. ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా దీనిపైన చర్చ. భర్త నోటిలో ఉన్న నాలుకను భార్య ఎలా కొరికింది. విభేదాలు ఉంటే ఇది ఎలా సాధ్యం. ఇద్దరు మౌత్ టు మౌత్ కిస్ చేసుకునే సమయంలో.. భర్త నాలుక భార్య కొరికి ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇష్టం లేకుండా బలవంతంగా భార్యకు ముద్దు పెట్టేందుకు వెళ్లిన భర్త నాలుకను కొరికేసిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లం గుట్ట తండాలో చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లం గుట్ట తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఏకంగా భర్త నాలుక కొరికేసిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెందిన మహిళతో 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. సజావుగా సాగిన వీరి కాపురంలో గత రెండు సంవత్సరాలుగా తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భార్య దగ్గరకు వెళ్లిన భర్త నాలుకను భార్య కొరికేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన తారాచంద్ నాయక్ చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ సంఘటనపై జొన్నగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తనపై దాడి చేసి తనకు ఇష్టం లేకుండా బలవంతంగా తనకు ముద్దు పెట్టేందుకు వచ్చినందుకే ఇలా జరిగిందని భార్య పుష్పావతి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. భర్త నుంచి పోలీసులు ఇంకా వివరాలు సేకరించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..