ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి? తెలుగు రాష్ట్రాల వాతావరణంపై తాజా అప్‌డేట్ ఇదే..

తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి? తెలుగు రాష్ట్రాల వాతావరణంపై తాజా అప్‌డేట్ ఇదే..
Weather Update

Updated on: Oct 20, 2026 | 7:00 AM

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగళవారం, బుధవారం పిడుగులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేసింది.

ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అంతేకాకుండా.. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us