Vizianagaram News: విజయనగరంలో రెస్టారెంట్ నిర్వాహకులు ఓనర్ కూతళ్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అద్దె చెల్లించకపోగా.. రెంట్ ఇవ్వమని అడిగేందుకు వెళ్లిన ఓనర్ కూతుర్లపై దాడి చేసిన అజంతా రెస్టారెంట్ నిర్వాహకులు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా కేంద్రం మూడు లాంతర్లు దగ్గర జరిగింది. ఇంటి అద్దె అడిగేందుకు వెళ్లిన ఓనర్ కూతుర్లపై .. రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేశారు. నిర్మానుష్య గదిలో బంధించి అసభ్యకరంగా ప్రవర్తించారు రెస్టారెంట్ నిర్వహకులు.
అసలే తండ్రిని పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవల్సిందిపోయి.. ఆరునెలలుగా అద్దె చెల్లించకపోవడమే కాకుండా..రెంట్ ఇవ్వాలని అడిగేందుకు వచ్చిన ఓనర్ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అజంతా రెస్టారెంట్ నిర్వాహకులు. గాయపడ్డ మైనర్ బాలికలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వక్కలంక వారి వీధికిచెందిన సాయి ప్రసాద్ కు మూడు లాంతర్ల సెంటర్ సమీపంలో ఇళ్లు ఉంది. అది అజంతా రెస్టారెంట్‌కు అద్దెకు ఇచ్చాడు. సాయి ప్రసాద్ ఆరునెలల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి వారి ఫ్యామిలీకి రెస్టారెంట్ అద్దె చెల్లించకుండా ఇబ్బందిపెడుతున్నారని బాధిత మైనర్ బాలికలు ఆరోపిస్తున్నారు.
పోలీసులకు కంప్లైంట్ చేసినా న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మైనర్ బాలికలు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..