కరోనా పరీక్షలు పెంచండి: హైకోర్టు కీలక ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కరోనా పరీక్షలపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

కరోనా పరీక్షలు పెంచండి: హైకోర్టు కీలక ఆదేశాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 4:23 PM

రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కరోనా పరీక్షలపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.  కరోనా కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని, జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కరోనా కేసులు వెల్లడించాలని హైకోర్టు తెలిపింది. అంతేకాదు జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసుల వివరాలు కాలనీ సంఘాలకు కూడా ఇవ్వాలని సూచించింది. ఇక ఐసీఎంఆర్ సూచించిన సూచనలు పరిగణలోకి తీసుకొని ర్యాపిడ్ యాంటీజెంట్ టెస్ట్ నిర్వహించాలని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అలాగే గాంధీతో పాటు 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని ప్రచారం చేయాలని న్యాయస్థానం ప్రభుత్వానికి వెల్లడించింది. ఈ సందర్భంగా సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం వివరించాలని హైకోర్టు పేర్కొంది.

మరోవైపు గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వాలని న్యాయస్థానం తెలిపింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లోని సిబ్బందికి గాంధీ తరహా షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా లక్షణాలు లేని ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు నిర్వహించాలన్న ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇక ఈ విచారణకు ప్రభుత్వం తరపున పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్లు శ్రీనివాసరావు హైకోర్టుకు తెలపగా.. గాంధీలో ప్లాస్మా, యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ ప్రయోగాలు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. వీటిపై స్పందించిన హైకోర్టు ఈనెల 29లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Read This Story Also: మూడో పెళ్లికి సిద్ధమైన నటి, ‘బిగ్‌బాస్’ ఫేమ్‌

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌