నర్సరీలో పనిచేసే అర్హులందరికీ కేటీఆర్ భరోసా

ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడుకోవడానికి అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీ లో మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ లో పని చేస్తున్న కార్మికుల యోగక్షేమాలు..

నర్సరీలో పనిచేసే అర్హులందరికీ కేటీఆర్ భరోసా
Follow us

|

Updated on: Jun 17, 2020 | 3:11 PM

ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడుకోవడానికి అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అధిక జనాబా, అధిక కాలుష్యం, తక్కువ అడవి ఉండే పట్టణాల్లో పచ్చదనం పెంచాలని స్పష్టం చేసింది. అటు మున్సిపాలిటీలు పచ్చదనానికి కేటాయించిన 10 శాతం నిధులు కూడా వాడుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీ లో మొక్కలను పరిశీలించారు. హుడా కాలనీ నర్సరీలోని మొక్కలను పరిశీలించి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా నర్సరీలో మొక్కలు పెంచుతున్న తీరు, ఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నర్సరీ లో పని చేస్తున్న కార్మికుల యోగక్షేమాలు, జీతం, ఈఏఎస్ఐ సదుపాయాల గురించి మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ రావడం లేదని వాపోయిన కార్మికులు.. వచ్చే 10 వేల రూపాయల జీతం సరిపోవడం లేదని మంత్రి కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. కార్మికుల సమస్యలకు స్పందించిన మంత్రి కేటీఆర్..వారికి భరోసానిచ్చారు. అధికారుల తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..