ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తం.. ఒకరిపై మరొకరు కుర్చీలతో దాడి.. సభ్యుడికి గాయాలు

అమరావతిలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ రసాభాసగా ముగిసింది. బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల విషయంలో వివాదం తలెత్తింది.

  • Ram Naramaneni
  • Publish Date - 7:05 pm, Thu, 8 April 21
ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తం.. ఒకరిపై మరొకరు కుర్చీలతో దాడి.. సభ్యుడికి గాయాలు
Lawyers Fight

అమరావతిలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ రసాభాసగా ముగిసింది. బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై చర్చిందేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సభ్యుల మధ్య మాటా, మాటా పెరిగి వివాదం తలెత్తింది. దీంతో న్యాయవాదులు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. కొట్టుకున్నారు. ఈ గొడవలో బార్ ‌కౌన్సిల్‌ సభ్యుడు అజయ్‌కుమార్‌కి గాయాలయ్యాయి. న్యాయవాదుల మధ్య తీవ్ర తోపులాట జరగ్గా… పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సద్దుమణిగింది. వివాదాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు వివరించాలని గాయపడ్డ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

 

 

ఇటీవల లాయర్లకు క్రికెట్ పోటీలు….

క్రీడాకారులు, న్యాయవాద వృత్తికి సారుప్యత ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ మఠం వెంకట రమణ న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా  న్యాయస్థానం స్వర్ణోత్సవం వేడుకల సందర్భంగా.. న్యాయవాదుల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి న్యాయవాదులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జస్టిస్ వెంకట రమణ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. క్రికెట్ టీమ్‌లోని ప్లేయర్స్ అందరూ కలిసికట్టుగా గెలుపుకోసమే పోరాడినట్టు.. న్యాయస్థానాల్లో కేసుల గెలుపు కోసం లాయర్లు కూడా అంతే ప్రయత్నం చేస్తారని ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం కేసుల విచారణ వర్చువల్ పద్దతిలో సాగుతుందని.. ఒకరితో ఒకరు ఆత్మీయంగా మాట్లాడుకునే పరిస్థితి లేదన్నారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు క్రీడా, సాంస్కృతిక పోటీలు ఉపయోగపడతాయని జస్టిస్ మఠం వెంకట రమణ చెప్పారు.

 

Also Read: ఏపీలో కరోనా కల్లోలం.. ఊహించనంతగా పెరిగిన పాజిటివ్ కేసులు, ప్రమాదకరంగా మరణాలు

పెంపుడు పిల్లి మిస్ అయ్యింది.. ఇళ్లంతా వెతకగా.. షాకింగ్.. కొండచిలువ కడుపులో