ఎల్‌నినో పంజా.. అడుగంటుతున్న ప్రాజెక్టులు.. ముంచుకొస్తున్న కరువు ముప్పు..!

కరువు నోటికి అడ్డంగా దొరికిపోయాం.. ఎస్.. ఇది నిజంగా నిజం. ఎల్‌నినో సృష్టించబోయే ఉత్పాతాన్ని నాలుగు చాప్టర్లుగా విడదీసుకుంటే, ఇప్పుడు మనం ఫస్ట్‌చాప్టర్‌లోకి చేరుకున్నాం. వానలు తగ్గి వర్షాభావం లెక్కలు తేలి, ముందుజాగ్రత్తలు తీసుకునే దశ ఇది. జనానికి నీటి కటకటను అలవాటు చేసి, రాబోయే రెండేళ్లూ కరువును ఎలా జీర్ణించుకోవాలో మానసికంగా ప్రిపేర్ చేయడం. అదే జరుగుతోందిప్పుడు. ఆరుతడి మాట దేముడెరుగు.. ముందు గొంతు తడిపే దారి చూద్దాం అని హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాలు.

ఎల్‌నినో పంజా.. అడుగంటుతున్న ప్రాజెక్టులు.. ముంచుకొస్తున్న కరువు ముప్పు..!
Unprecedented Drought In South India

Updated on: Oct 13, 2026 | 10:05 PM

50 శాతం వర్షపాతం లోటు. 50 డిగ్రీలకు చేరుతున్న టెంపరేచర్లు. ఈ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా ఏమని సంకేతాలిస్తోంది? చినుకు సవ్వడితో మురిసిపోవాల్సిన వానాకాలం.. గుండెలు మండేకాలంగా ఎందుకు షేపులు మార్చుకుంది? సూపర్ ఎల్‌నినో పుణ్యమా అని.. వర్షపు చినుకు లేకుండానే నైరుతి రుతుపవనం కాస్తా చల్లగా జారుకుంటోంది. వాయుగుండాలతోనే వానగండం నుంచి బైటపడాల్సిన అత్యవసర పరిస్థితి. ఔను, రాబోయే నీటి కరువు ఏ రేంజ్‌లో ఉంటుందో శాంపిల్ పీస్ చూస్తున్నట్టుంది జనానికి, ప్రభుత్వాలకు. రాబోయే కరువు గురించి ముందస్తు అంచనా కోసం జలవనరుల యంత్రాంగంతో మూడుగంటలపాటు ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేట్ వార్నింగ్ ఇది. నాటోన్లీ తెలంగాణ.. దేశమంతటా ఇదే దురవస్థ. నీటిచుక్క కోసం అల్లాడిపోయే రోజు.. వందలు-వేలు తగలేస్తే తప్ప లీటరు నీళ్లు దొరకని రోజు.. ఎంతో దూరంలో లేదు. ఒడిసిపట్టిన ప్రతీ నీటి చుక్కా దాహం తీర్చుకోడానికే. తాగునీటి అవసరాలకే ఫస్ట్ ప్రయారిటీ. సాగు కోసం ఒక్క చుక్కయినా నీళ్లు దాచుకునే పరిస్థితే లేదు. పైగా, భూగర్భజలాల్ని పోటీపడి పీల్చేసుకుంటాం.. గ్రౌండ్ వాటర్ లెవల్ జీరోకు పడిపోతోంది. సాధారణం కంటే సగానికి సగం నిల్వలు పడిపోయి, నీటి రిజర్వాయర్లన్నీ మొండిగోడల్లా మారిపోయాయి. క్రాప్ హాలిడే ఫర్ ప్యాడీ.....

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి