హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం..! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. భక్తవత్సలుడు కొలువైన ప్రాంతం..! అలాంటి తిరుమల కొండపై.. ఆ దేవదేవుడి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందనే వార్త పెను సంచలనమే అయ్యింది..! ఇది కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం..! అందుకే ఇప్పుడు ప్రాయశ్చిత్త కార్యక్రమాలు జరుగుతున్నాయ్..! ఏదైనా తప్పు జరిగిందని గుర్తిస్తే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు.. కానీ ఇది పశ్చాత్తాపంతో సరిపెట్టేంత చిన్న అంశం కాదు కాబట్టే.. ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి దగ్గర యాగశాలలో మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో శాంతి హోమం కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేయనున్నారు.
అనేక అనుమానాలు.. అంతకు మించిన వివాదాలు. తిరుమల లడ్డూ అపవిత్రమైందన్న ప్రచారం నేపథ్యంలో శాంతి హోమం చేపట్టింది టీటీడీ. తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన హోమం 10 గంటల వరకు కొనసాగనుంది. లడ్డూ పవిత్రత దోష పరిహారం కోసమే యాగ నిర్వహణ అంటున్నారు అర్చకులు. సందేహాల నడుమ ముందుకు సాగలేం. అందుకే శాంతియాగం నిర్వహిస్తున్నామని అంటున్నారు ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు.
విమాన ప్రాకారం దగ్గర 3 హోమగుండాలతో మహా క్రతువు కొనసాగుతోంది. 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులతో యాగం నిర్వహిస్తున్నారు. సమస్త దోష పరిహారం, సంశయాల నివృత్తి కోసం ప్రత్యేక సంకల్పంతో యాగం ఏర్పాటు చేసింది టీటీడీ. లడ్డూ పోటు, ద్రవ్యశాల, ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. హోమం తర్వాత పంచగవ్య ప్రోక్షణ నిర్వహించనున్నారు అర్చకులు.
శ్రీవారి ఆలయంలోని బంగారు బావి దగ్గర యాగశాలలో మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో శాంతి హోమం కొనసాగుతోంది. శాంతిహోమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. ఆవు నెయ్యిలో దోషం ఉండటం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని అంటున్నారు EO శ్యామలారావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..