టీటీడీ పవిత్రత, ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధానికి జగన్ లేఖ

|

Sep 22, 2024 | 4:01 PM

తిరుపతి లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో పొలిటికల్‌ హాట్‌ స్పాట్‌ ఇప్పుడు లడ్డూ పే రచ్చ పీక్స్‌కు వెళ్లింది.

టీటీడీ పవిత్రత, ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధానికి జగన్ లేఖ
Jagan Letter To Modi
Follow us on

తిరుపతి లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో పొలిటికల్‌ హాట్‌ స్పాట్‌ ఇప్పుడు లడ్డూ పే రచ్చ పీక్స్‌కు వెళ్లింది. కల్తీ వివాదం రాజకీయాలకు మరింత ఆజ్యం పోసింది. తప్పు చేసిన వాళ్లను ఉపేక్షించే ప్రసక్తేలేదంటోంది ప్రభుత్వం. మరోవైపు లడ్డూ వివాదంపై లాజికల్‌గా కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నంచేస్తోంది వైసీపీ.

మరోవైపు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను దెబ్బతీసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఈ లేఖలో ఆరోపించారు. అంతేకాదు చంద్రబాబును గట్టిగా మందలించాలని, అసలు నిజాలు బయటపెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్య ఘటనలపై దృష్టి సారించేందుకు ఈ లేఖ రాస్తున్నానని, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, సమగ్రత, ప్రతిష్టకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వేంకటేశ్వరుడికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హిందూ భక్తులు ఉన్నారని, ఈ సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే, ఈ అబద్ధం చాలా హాని కలిగిస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

టీటీడీ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు, తిరుమల ఆలయంలో ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉందని, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, దానికి బదులు తిరుమల జంతు కొవ్వును వాడారని ఆరోపించారు. లడ్డూల తయారీలో ఈ ప్రసాదం కోట్లాది మంది హిందువుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని జగన్ గుర్తు చేశారు. టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని లేఖలో కోరిన జగన్, సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయకపోతే చాలా తీవ్రమైన, విస్తృత పరిణామాలుంటాయన్నారు.

కొత్త ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న జగన్, ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా పెట్టలేకపోయిందని పేర్కొన్నారు. చంద్రబాబు సమర్థతపై ప్రజల్లో నమ్మకం పోయిందని జగన్ ధ్వజమెత్తారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. తిరుమల విషయంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారని జగన్ ఆరోపించారు. 6 నెలలకు ఓసారి ఈ-టెండరింగ్ ద్వారానే నెయ్యి కొనుగోళ్లు జరుగుతాయని, నెయ్యి కొనుగోళ్లపై దశాబ్దాలుగా ఇలాగే జరుగుతోందన్నారు. ప్రమాణాలకు తగ్గట్టు నెయ్యి లేకపోతే.. ట్యాంకర్లను వెనక్కి పంపడం గతంలో చాలాసార్లు జరిగిందని ప్రధాని మోదీకి రాసిన లేఖల్ జగన్ పేర్కొన్నారు.

తిరుపతి ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనికి సంబంధించి ల్యాబ్‌ రిపోర్టును కూడా విడుదల చేశారు. ఆ తర్వాత రాజకీయంగా వివాదం రేగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..