Tirumala Tirupati: తిరుమత తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరలను నిర్ణయించింది టీటీడీ. 2006లో ఉదయాస్తమాన సేవను రద్దు చేసిన టీటీడీ.. 2006 వరకు కేటాయించి మిగిలిపోయిన 531 టికెట్లను భక్తులకు కేటాయించాలని గత పాలకమండలిలో టీటీడీ నిర్ణయించింది. అయితే మామూలు రోజుల్లో కోటి రూపాయలు, శుక్రవారం రోజు కోటిన్నర రూపాయలకు ఉదయాస్తమాన సేవ టికెట్లను జారీ చేయనుంది టీటీడీ.
ఆన్‌లైన్‌లోనే టికెట్ అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఉదయాస్తమాన సేవ టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు భక్తులు. ఏడాదికి ఒక్క రోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనేలా సదుపాయం కల్పిస్తుంది పాలక మండలి. ఈ సేవా టికెట్ల కేటాయింపులో టీటీడీ బోర్డు దాదాపు 600 కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది.
ఇవి కూడా చదవండి: