Andhra: వీడెవడ్రా బాబూ..! అర్థరాత్రి బట్టలు లేకుండా లోపలకు దూరి..

దొంగతనానికి వెళ్లేటప్పుడు దొంగ అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తాడు.. ఇది వరకు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్.. లేదా టవల్ చుట్టుకోవడం.. కేవలం ఒంటిపై చెడ్డి మాత్రమే వేసుకొని ఒంటినిండా ఆయిల్ పూసుకుని దొంగతనానికి వెళ్తారు.. కానీ..

Andhra: వీడెవడ్రా బాబూ..! అర్థరాత్రి బట్టలు లేకుండా లోపలకు దూరి..
Robbery

Edited By:

Updated on: Mar 07, 2026 | 2:59 PM

దొంగతనానికి వెళ్లేటప్పుడు దొంగ అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తాడు.. ఇది వరకు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్.. లేదా టవల్ చుట్టుకోవడం.. కేవలం ఒంటిపై చెడ్డి మాత్రమే వేసుకొని ఒంటినిండా ఆయిల్ పూసుకుని దొంగతనానికి వెళ్తారు.. కానీ ఇక్కడో దొంగ సీసీ కెమెరాలో తన ముఖం కనబడకుండా ఉండేందుకు.. ఒంటిపై ఉన్న ఒకే ఒక్క టవల్ ను తీసేసి.. తల మీద కప్పుకుని.. బట్టల్లేకుండా దొంగతనం చేశాడు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్ లో ఉన్న మెట్రో సూపర్ మార్కెట్లోకి అర్ధరాత్రి ఒక దొంగ చోరీకి పాల్పడ్డాడు. సూపర్ మార్కెట్ ఎంట్రెన్స్ సీసీ కెమెరాలో చూస్తే దొంగ ఒంటిపై ఓ టవల్ మాత్రమే కట్టుకొని లోపలికి ప్రవేశించాడు.. తీరా షాపు లోపలికి వచ్చిన తర్వాత దొంగతనం చేసేటప్పుడు సీసీ కెమెరాలు గమనించాడు ఆ దుండగుడు.. దీంతో కట్టుకున్న టవల్ను తీసి ముఖం కనబడకుండా తలపై కప్పుకున్నాడు. ఇంకేముంది ఒంటిపై నూలు పోగు లేకుండా చోరీకి పాల్పడ్డాడు.

వీడియో చూడండి..

సూపర్ మార్కెట్లో ఉన్న 40 వేల నగదుతో పాటు కొన్ని సరుకులను కూడా దుండగుడు ఎత్తుకెళ్లాడు. చోరీ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సిసి ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం ఈ దిసమొల దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us