Andhra: ఎంతపని చేశావ్ మానస.. బాయ్‌ఫ్రెండ్ చెప్పినట్లు చేసింది.. చివరకు

ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హనీ ట్రాప్‌కు గురై రూ. 81 లక్షలు పోగొట్టుకున్నాడు. మూడేళ్లుగా ఫోన్‌లో పరిచయమైన అమ్మాయిని గుడ్డిగా నమ్మి, ఆమె అడిగినప్పుడల్లా డబ్బులిచ్చాడు. తీరా చూస్తే, తన ఊరిలో ఉండే స్నేహితుడు, అతని గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఇదంతా ప్లాన్ చేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Andhra: ఎంతపని చేశావ్ మానస.. బాయ్‌ఫ్రెండ్ చెప్పినట్లు చేసింది.. చివరకు
Software Engineer Honey-Trapped

Edited By:

Updated on: Apr 29, 2026 | 1:51 PM

అతను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్.. మంచి జీతం.. ఇంతలోనే ఓ అమ్మాయి ప్రేమిస్తున్నానంటూ అతనికి ఫోన్ చేసింది.. ఇతను కూడా ఆ అమ్మాయి మోజులో పడ్డాడు.. ట్విస్ట్ ఏంటంటే.. ఒక్కసారి కూడా ఆమె మొహం చూడలేదు.. ఇలా మూడేళ్లు గడిచిపోయాయి.. చివరకు మామూలు ట్విస్ట్ కాదు.. ఆ అమ్మాయి మొహం కూడా చూడకుండానే హనీ ట్రాప్ లో పడి 81 లక్షల రూపాయలు స్వాహా చేసుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి… తీరా విషయం ఆరా తీస్తే తన ఊర్లో ఉన్న వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌తో హనీ ట్రాప్ చేయించి డబ్బులు కాజేసినట్టు తెలుసుకున్నాడు ఆ సాఫ్ట్వేర్.. చివరకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు..

కడప జిల్లా బద్వేల్ నగరంలోని గూడెం గ్రామానికి చెందిన అశోక్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్‌ని.. పూజిత రెడ్డి అనే ఇన్ స్టా అకౌంటుతో మోసం చేసి 81 లక్షల 67 వేల రూపాయలను దండుకున్నారు.. 2023లో ఏర్పడిన పరిచయం దగ్గర నుంచి దాదాపు మూడు సంవత్సరాలు ప్రేమిస్తున్నాను.. అని వెంటపడుతున్న ఆ అమ్మాయి మొహం కూడా చూడలేదు.. కానీ.. ఆమె అడిగినప్పుడల్లా అకౌంట్ లో డబ్బులు వేస్తూ.. అప్పులు చేసి మరి తన ప్రియురాలికి అశోక్ డబ్బులు పంపించాడు. తీరా కొన్ని రోజుల తర్వాత నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీసిన అశోక్ కు అసలు విషయం బయటపడింది.

అసలు విషయానికి వస్తే.. అశోక్ సొంత గ్రామానికి చెందిన రామలింగారెడ్డి అనే వ్యక్తి ఈ కథంతా నడిపించినట్లు పోలీసులు తెలిపారు. రామలింగారెడ్డి తన గర్ల్ ఫ్రెండ్ మానసతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు క్రియేట్ చేయించి ఆమె ద్వారా అశోక్ కు మొదట హాయ్ అనే మెసేజ్ పెట్టించాడు. ఆ తరువాత రామలింగారెడ్డి …అశోక్ వద్దకు వచ్చి నీకు పూజిత రెడ్డి అనే అమ్మాయి హాయ్ అని మెసేజ్ పెట్టిందని.. ఆ అమ్మాయి చాలా మంచిదని చాలా మంచి కుటుంబం అని అశోకు నమ్మబలికాడు.. అయితే.. రామలింగారెడ్డి మాటలు నమ్మిన అశోక్ ఇన్‌స్టా ఫేక్ ఎకౌంటు క్రియేట్ చేసి మాట్లాడుతున్న పూజిత రెడ్డి అలియాస్ మానసతో పరిచయం పెంచుకున్నాడు.. మెస్సుజుల ద్వారా తనకు మరింత దగ్గర అయ్యాడు.. ఒక్కసారి కూడా కలవలేదు.. ఈ క్రమంలోనే.. అశోక్ వద్ద నుంచి డబ్బులు గుంజటం మొదలుపెట్టారు కిలాడీలు..

మొదట తన అక్క పెళ్లికి పట్నం డబ్బులు అవసరమని.. కొత్త ఇల్లు నిర్మిస్తున్నామని తన దగ్గర ఎనిమిది లక్షలు అమౌంట్ ఉందని మిగతా డబ్బును సర్దాలని అశోక్ ను డబ్బు విషయంలో ముగ్గులోకి దించారు.. ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్క కారణాలు చెబుతూ పలు దఫాలుగా 81 లక్షల 67 వేల రూపాయలను కాజేశారు. పూజితకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం కోసం సొంత ఊరులో దాదాపు 15 లక్షలు వరకు అప్పు చేశాడు. అంతేకాకుండా తను చెన్నైలో ఉద్యోగం చేస్తున్న తన కొలీగ్స్ వద్ద నుంచి కూడా కొంత డబ్బు అప్పు తీసుకొని ఇచ్చాడు. అయితే ఈ డబ్బులన్నీ రామలింగారెడ్డికి చెందిన కొంతమంది బంధువుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.

ఇదంతా తెలియని అశోక్ పూజిత డబ్బులు కావాలి అని అడిగినప్పుడల్లా ఇస్తూనే వచ్చాడు.. మొదట ప్రేమగా.. ఆ తర్వాత బాధలు చెప్పి డబ్బులు అడిగిన పూజిత అలియాస్ మానస.. అశోక్ డబ్బులు ఇవ్వకపోవడంతో మళ్లీ మరో ప్లాన్ మొదలు పెట్టింది. బెదిరించి డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతానని చెప్పడం.. చేతులు కోసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం వంటివి చేస్తుండడంతో చేసేదేమీ లేక డబ్బులను ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తరువాత పూజిత అలియాస్ మానస పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తనకు డబ్బులు అవసరమని వాటిని తిరిగి చెల్లించాలని అశోక్ అడిగాడు.. అయితే.. ఆ తర్వాత నుంచి తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. అనుమానం వచ్చిన అశోక్ రామలింగారెడ్డికి కాల్ చేసి మాట్లాడాడు.. అతను కూడా కొంతకాలం తర్వాత ఫోన్ను లిఫ్ట్ చేయకపోవడంతో విషయంపై పూర్తిగా ఆరా తీసి అసలు విషయాన్ని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు అశోక్.. ఏది ఏమైనా హనీ ట్రాప్ లో పడి లక్షల రూపాయలను సాఫ్ట్వేర్ ఉద్యోగి అశోక్ పోగొట్టుకున్న ఈ వ్యవహారం.. ఇప్పుడు సంచలనంగా మారింది.

వీడియో చూడండి..

Follow Us