ఆన్‌లైన్‌లో పందెంకోళ్లు… ధర ఎంతంటే.?

ఆన్‌లైన్‌లో పందెంకోళ్లు... ధర ఎంతంటే.?

సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు.. ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల హడావుడి మొదలవుతుంది. ఈ క్రమంలోనే ఆన్లైన్‌లో పందెంకోళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. యజమానులు తమ ఇంటి వద్ద నుంచే పందెంకోళ్ల ఫోటోలు, ధరలను తెలుపుతూ.. అంతర్జాలంలో అమ్ముకుంటున్నారు. జిల్లాలోని ఏలూరు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు ఈ స్టైల్‌లో అమ్మకాలు చేపడుతున్నారు. ఇక ఏపీతో పాటు కేరళ, కర్నాటక, గోవాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఈ పందెం కోళ్లను సామాజిక మాధ్యమాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అటు […]

Ravi Kiran

| Edited By: Srinu Perla

Dec 03, 2019 | 7:29 PM

సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు.. ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల హడావుడి మొదలవుతుంది. ఈ క్రమంలోనే ఆన్లైన్‌లో పందెంకోళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. యజమానులు తమ ఇంటి వద్ద నుంచే పందెంకోళ్ల ఫోటోలు, ధరలను తెలుపుతూ.. అంతర్జాలంలో అమ్ముకుంటున్నారు. జిల్లాలోని ఏలూరు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు ఈ స్టైల్‌లో అమ్మకాలు చేపడుతున్నారు. ఇక ఏపీతో పాటు కేరళ, కర్నాటక, గోవాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఈ పందెం కోళ్లను సామాజిక మాధ్యమాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అటు ఒక్కో పుంజును జాతిని బట్టి వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు అమ్ముతున్నారు. ముఖ్యంగా వీటిని OLX, ఫేస్‌బుక్‌లో ఫోటోలు పోస్ట్ చేసి తమ ఫోన్‌ నెంబర్ల ద్వారా బేరసారాలు సాగిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu