Konaseema: చెట్టు నిండా గుత్తులు.. గుత్తులుగా మామిడి కాయలు.. ఎక్కడా సందు లేదు.. మీరే చూడండి

కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం పునాస మామిడి చెట్టుకు గుత్తులు, గుత్తులుగా కాయలు కాశాయి. దీంతో అక్కడికి వచ్చిన జనాలు ఆ మామిడి కాయలు చూసి ఆశ్చర్యపోతున్నారు.

Konaseema: చెట్టు నిండా గుత్తులు.. గుత్తులుగా మామిడి కాయలు.. ఎక్కడా సందు లేదు.. మీరే చూడండి
Punasa Mango
Follow us

|

Updated on: Aug 01, 2022 | 2:07 PM

Andhra Pradesh: సాధారణంగా సమ్మర్‌లో మామికాయల సీజన్‌ వస్తుంది. ఎక్కడ చూసినా మామిడికాయలతో నిండిన చెట్లు మ్యాంగో ప్రియులను ఊరిస్తూ ఉంటాయి. అయితే సీజన్‌ అయిపోయాక కూడా కొన్ని చెట్లు కాయలు కాస్తాయి. వాటిలో పునాస మామిడి ఒకటి. ఇప్పుడు ఈ మామిడి చెట్టు కోనసీమ జిల్లా అమలాపురం(Amalapuram)లో చర్చనీయాంశంగా మారింది. కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో పునాస మామిడి చెట్టు విరగ కాసింది. గుత్తులు గుత్తులుగా వందలాది కాయలు కాసిన మామిడి చెట్టును జనాలను చూపు తిప్పుకోనివ్వడంలేదు. వివిధ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన జనం ఈ చెట్టును చూసి ఆశ్చర్యపోతున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎంట్రన్స్ లో ఉన్న ఈ చిన్న పునాస మామిడి చెట్టు కొమ్మ కొమ్మకూ కాసిన కాయలతో అబ్బురపరుస్తుంది. అయితే ఆగస్టు 1న స్పందన కార్యక్రమం కావడంతో కలెక్టర్ కార్యాలయానికి వందలాదిమంది అర్జీదారులు వచ్చారు. వారంతా మామిడి చెట్టును చూసి నిర్ఘాంతపోయారు. పునాస ఈ సీజన్‌లో కాస్తుందని తెలుసు కానీ.. ఈ స్థాయిలో కాపు ఉండటం మాత్రం అరుదని వారు అంటున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి