ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బహుదానదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఓ పురాతన వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ బ్రిడ్జీ మీదకు వెళ్లగానే బ్రిడ్జీ నిట్టనిలువునా కూలిపోయింది. అకస్మాత్తుగా పురాతన వెంతెన కూలడంతో రాళ్లలోడుతో వెళ్తున్న లారీ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
వంతెన కూలిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇచ్చాపురం బ్రిడ్జి 60 అడుగుల మేర కూలిపోయిందని పోలీసులు తెలిపారు. NH 16 నుంచి ఇచ్చాపురంలోకి వెళ్లే రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇచ్చాపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
బ్రిడ్జి కూలిన వీడియో చూడండి..
బ్రిడ్జి కూలిన విషయం తెలుసుకున్న స్థానికులు చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..