Andhra Pradesh: 140 ఏళ్ల చెట్టుకు రాఖీ కట్టి.. హారతి పట్టిన జనాలు..! ఎందుకో తెలిస్తే ఒళ్లు పులకరిస్తుంది

| Edited By: Srilakshmi C

Aug 04, 2024 | 8:53 PM

రక్షాబంధన్ అంటే అన్న చెల్లెల మధ్య అనుబంధానికి ఓ రూపం. అన్నదమ్ములకు రాఖీ కట్టి.. కలకాలం రక్షణగా ఉండాలని, అన్నదమ్ముల నుంచి రక్షణ కోరుకుంటారు ఆడపడుచులు. కానీ.. విశాఖలో మాత్రం ప్రకృతి ప్రేమికులు వృక్షా బంధన్ నిర్వహిస్తున్నారు. 140 ఏళ్ల చరిత్ర గల ఓ మర్రిచెట్టుకు రాఖీ కట్టి పర్యావరణాన్ని పరిరక్షణకు పిలుపునిచారు. పురాతన చెట్ల పరిరక్షణకు వినూత్న సందేశం ఇస్తున్నారు..

Andhra Pradesh: 140 ఏళ్ల చెట్టుకు రాఖీ కట్టి.. హారతి పట్టిన జనాలు..! ఎందుకో తెలిస్తే ఒళ్లు పులకరిస్తుంది
Vrukha Bandan At Vizag
Follow us on

విశాఖపగ్నం, ఆగస్టు 4: రక్షాబంధన్ అంటే అన్న చెల్లెల మధ్య అనుబంధానికి ఓ రూపం. అన్నదమ్ములకు రాఖీ కట్టి.. కలకాలం రక్షణగా ఉండాలని, అన్నదమ్ముల నుంచి రక్షణ కోరుకుంటారు ఆడపడుచులు. కానీ.. విశాఖలో మాత్రం ప్రకృతి ప్రేమికులు వృక్షా బంధన్ నిర్వహిస్తున్నారు. 140 ఏళ్ల చరిత్ర గల ఓ మర్రిచెట్టుకు రాఖీ కట్టి పర్యావరణాన్ని పరిరక్షణకు పిలుపునిచారు. పురాతన చెట్ల పరిరక్షణకు వినూత్న సందేశం ఇస్తున్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరువలో విశ్రాంత గృహం వద్ద ఉన్న వృక్షం ఇది. దీనికి చాలా ఏళ్ల చరిత్ర ఉంది. 1887లో బొంబాయి నాగపూర్ రైల్వే లైన్ నిర్మాణం సమయంలో కార్మికులకు నీడ కోసం నాటిన మొక్కల్లో ఇది ఒకటి. దాని వయసు దాదాపు140 ఏళ్ళు. ఇప్పటికే చాలా మొక్కలు ప్రకృతి విధ్వంసంలో కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంకా ఇటువంటి వృక్షాలు కొన్ని మాత్రమే విశాఖలో మిగిలి ఉన్నాయి. దీంతో వాటిని పరిరక్షించుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇందులో భాగంగా ప్రతి ఏటా ఇటువంటి వృక్షాలకు వృక్షాబంధన్ నిర్వహిస్తుంటారు. గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు తరలివచ్చి వేడుకను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. వృక్షాబంధన్‌కు రాఖీ కట్టి ఇటువంటి చెట్లను కాపాడుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేశారు.

చెట్టుకు రాఖీ.. హారతి..

పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను మనిషి అభివృద్ధి పేరిట నరికేస్తున్నాడు. ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాడు. చెట్లు లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించాలని అంటున్నారు విశాఖలో ప్రకృతి ప్రేమికులు. రక్షా బంధన్‌ను వృక్షా బంధన్ గా నిర్వహిస్తున్నారు. ఏటా రాఖీ పండుగ నెలలో విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కడుతున్నారు. చెట్లకు కడుతున్న ఈ రాఖీలను విత్తనాలతో తయారు చేస్తారు. చెట్ల కొమ్మలకు రాఖీలుగా కడతారు. పక్షులు విత్తనాలు తిని మట్టిలో విసర్జించడంతో మళ్లీ మొలకలు ఎత్తుతాయి. చెట్లుగా మారుతాయి.

హరితహారంతో అందాల విశాఖను పర్యావరణ రహిత నగరంగా మార్చుకోవచ్చని పర్యావరణ ప్రియులు చెబుతున్నారు. రక్ష బంధన్‌ను వృక్షా బంధన్‌గా జరుపుకుంటూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇదండీ విశాఖలో వృక్షాబంధన్ వేడుకలు. మీరు కూడా మీ పరిసరాల్లో కచ్చితంగా చెట్లను నాటండి. అంత అవకాశం లేకుంటే కనీసం ఉన్న చెట్లనైనా పరిరక్షించుకోండి. మనిషి ప్రాణాలు నిలిపే, ప్రాణవాయువును అందించే చెట్లు, మొక్కలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఏమంటారు..! నిజమేకదా..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.