‘100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు’.. పేదలకు తీపికబురు చెప్పిన ఏపీ మంత్రి..

|

Jul 04, 2024 | 7:19 AM

రాబోయే 100 రోజుల్లో లక్షా 28వేల ఇళ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు మంత్రి పార్థసారధి. అమరావతిలో గృహనిర్మాణ శాఖపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. పేదవాడికి గృహాలు అందించడమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. ఏపీలో సంక్షేమం, అభివృద్దితో పాటు అనేక సమస్యలపై దృష్టిపెట్టారు మంత్రులు. ఒకవైపు సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు, ఢిల్లీ పర్యటలతో బిజీగా ఉంటే.. డిప్యూటీ సీఎం పవన్ కూడా వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు.. పేదలకు తీపికబురు చెప్పిన ఏపీ మంత్రి..
Minister Parthsaradhi
Follow us on

రాబోయే 100 రోజుల్లో లక్షా 28వేల ఇళ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు మంత్రి పార్థసారధి. అమరావతిలో గృహనిర్మాణ శాఖపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. పేదవాడికి గృహాలు అందించడమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. ఏపీలో సంక్షేమం, అభివృద్దితో పాటు అనేక సమస్యలపై దృష్టిపెట్టారు మంత్రులు. ఒకవైపు సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు, ఢిల్లీ పర్యటలతో బిజీగా ఉంటే.. డిప్యూటీ సీఎం పవన్ కూడా వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే మరికొందరు మంత్రులు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‎లో అన్ని జిల్లాలకు సంబంధించిన గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. అధికారుల నుంచి సమగ్రమైన సమాచారం అందుకున్న తరువాత మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో 8లక్షల 4వేల705 ఇళ్లు వివిధ దశలో ఉండగా.. 5లక్షల 76వేల 670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు మంత్రి పార్థసారధి. కనుక రాబోయే వంద రోజుల్లో లక్షా28 వేల ఇళ్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మార్చి నెల నాటికి రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లు కట్టి పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టించారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎంక్వైరీ చేసి అధికారికంగా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి. ఇసుక దొరకని ప్రాంతంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని చెప్పారు మంత్రి. కొన్ని కంపెనీలు ఇళ్లను నిర్మించేందుకు ముందుకు వచ్చినా లాభదాయకంగా ఉన్న వరకూ పూర్తి చేసి తర్వాత వదిలేసిన పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి కంపెనీలపై జులై 31లోపు ఎంక్వైరీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు మంత్రి. మూడు నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. గతంలో చేసిన పనులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఇళ్లు కేటాయించారని, గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు కూడా వాడుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…