Budameru: ఎప్పుడూ పడని వర్షపాతం.. ఎన్నడూ చూడని వరుణ బీభత్సంతో వరదవాడగా మారిన విజయవాడలో సాధారణ పరిస్థితులు వచ్చాయి. మొన్నటివరకు వరద నీటిలో కనపడని రోడ్లు, భవనాలు.. ప్రస్తుతం నీట్‌గా మారాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో బుడమేరుకు మళ్లీ వరద అంటూ వదంతులు వ్యాప్తి చెందడంతో విజయాడలో కలకలం రేగింది. ఈ వార్తలతో విజయవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
వదంతులపై స్పందించిన మంత్రి నారాయణ మాట్లాడుతూ.. బుడమేరు కట్ట మళ్లీ తెగిందనడం అవాస్తవం అంటూ భరోసా ఇచ్చారు. అలాగే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటూ తెలిపారు. విజయవాడ పూర్తి సురక్షితంగా ఉందని, వదంతులు నమ్మొద్దు అంటూ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో విజయాడ కలెక్టర్ మాట్లాడుతూ.. బుడమేరు కట్టపై పుకార్లను నమ్మొద్దు అంటూ తెలిపారు. బుడమేరుకు ఎలాంటి ముంపు ప్రమాదం లేదని, వదంతులు వ్యాప్తి చేసేవారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..